ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి హాట్ బ్యూటీ అవుట్
తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ 8వ సీజన్ ఘనంగా ఎనిమిది వారాలను పూర్తి చేసుకుంది. ఈసారి ప్రోమోలతోనే అదరగొట్టిన బిగ్‌బాస్ , దానికి మించిన కంటెంట్‌తో అదరగొడుతున్నారు.అయితే ఈ సీజన్‌లో పెద్దగా పేరున్న ఆర్టిస్టులు లేకపోవడంతో షో యామమాన్యంపై అభిమానులు పెదవి విరుస్తున్నారు. హౌస్‌మెట్స్ మధ్య జరుగుతున్న గొడవలు చూడటానికి కొంచెం అతిగా అనిపిస్తున్నాయి. వంట దగ్గర నుంచి హోస్ శుభ్రంగా ఉంచుకోవడం, బాత్ రూమ్స్ నీట్‌గా లేకపోవడం అంశాలపై హౌస్‌మెట్స్ మధ్య గొడవలు జరిగాయి.
ఇక తొలివారం ఎలిమినేషన్‌లో భాగంగా బెజవాడ బేబక్క హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. రెండో వారంలో శేఖర్ భాషా ఎలిమినేట్ అయ్యారు. మూడోవారం హౌస్ నుంచి అభినవ్ బయటకు వచ్చేశారు. అయితే నాలుగోవారం సోనియా ఆకుల హౌస్ నుంచి ఎలిమినేషన్ అయింది. ఇక ఆ వారం మీడ్ వీక్ ఎలిమినేషన్‌లో భాగంగా హీరో ఆదిత్య ఓంను హౌస్ నుంచి బయటకు పంపించారు.ఐదో వారం నైనికా బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఇక ఐదో వారమే బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎనిమిది మంది వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు.

మెహబూబ్, హరితేజ, నాయని పావని, ముక్కు అవినాష్, గౌతమ్ కృష్ణ, రోహిణి, గంగవ్వ, టేస్టీ తేజ వంటి పాత కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా హౌస్‌లో అడుగుపెట్టారు.వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన పాత కంటెస్టెంట్స్ ఓ గ్రూప్, ప్రస్తుతం హౌస్‌లో కొనసాగుతున్న సభ్యులంతా మరో గ్రూప్‌గా విభజించారు. ఇక చివరి వారం హౌస్ నుంచి నాగ మణికంఠ ఎలిమినేట్ అయ్యాడు. మణికంఠ తనంతట తానే హౌస్ నుంచి బయటకొస్తానని, చెప్పడంతో నాగార్జున అతన్ని ఎలిమినేట్ చేశారు.ఇక ఎనిమిదో వారం హౌస్ నుంచి బయటకు రావడానికి కంటెస్టెంట్ల మధ్య పెద్ద యుద్దమే నడించింది.
ఈ వారంలో మొత్తం ఆరుగురు నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, విష్ణుప్రియ, మెహబూబ్, నయని పావని లు నామినేషన్స్ లో ఉన్నారు. ఎనిమిదో వారం ఓటింగ్‌లో నిఖిల్ టాప్ ప్లేస్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రేరణ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక టాప్ కంటెస్టెంట్, కొత్త మెగా చీఫ్ విష్ణు ప్రియ మూడో స్థానంలో కంటిన్యూ అవుతోంది.అయితే చివరి రెండు స్టానాల్లో మెహబూబ్ , నయనీ పావని ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నయనీ పావని హౌస్ నుంచి బయటకొచ్చినట్టు తెలుస్తోంది. మెహబూబ్ కంటే నయనికి తక్కువ ఓట్లు పడటంతో.. ఆమె బిగ్ బాస హౌస్ ను వీడిబయటకు వెళ్ళిపోయినట్టు సమాచారం.












Click it and Unblock the Notifications