ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్..బిగ్ బాస్ హౌస్ నుంచి టాప్ కంటెస్టెంట్ అవుట్
తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ 8వ సీజన్ ఘనంగా ఏడో వారాలను పూర్తి చేసుకుంది. ఈసారి ప్రోమోలతోనే అదరగొట్టిన బిగ్‌బాస్ , దానికి మించిన కంటెంట్‌తో ఆకట్టుకుంటారని అంతా భావించారు.అయితే ఈ సీజన్‌లో పెద్దగా పేరున్న ఆర్టిస్టులు లేకపోవడంతో షో యామమాన్యంపై అభిమానులు పెదవి విరుస్తున్నారు.మరోవైపు కంటెస్టెంట్లు సైతం ఇప్పటి వరకు పెద్దగా ఆకట్టుకున్నట్టు కనిపించలేదు.అయితే హౌస్‌మెట్స్ మధ్య జరుగుతున్న గొడవలు చూడటానికి కొంచెం అతిగా అనిపించాయి.
వంట దగ్గర నుంచి హోస్ శుభ్రంగా ఉంచుకోవడం, బాత్ రూమ్స్ నీట్‌గా లేకపోవడం అంశాలపై హౌస్‌మెట్స్ మధ్య గొడవలు జరిగాయి. ఇక తొలివారం ఎలిమినేషన్‌లో భాగంగా బెజవాడ బేబక్క హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. రెండో వారంలో శేఖర్ భాషా ఎలిమినేట్ అయ్యారు. మూడోవారం హౌస్ నుంచి అభినవ్ బయటకు వచ్చేశారు. అయితే నాలుగోవారం సోనియా ఆకుల హౌస్ నుంచి ఎలిమినేషన్ అయింది. ఇక ఆ వారం మీడ్ వీక్ ఎలిమినేషన్‌లో భాగంగా హీరో ఆదిత్య ఓంను హౌస్ నుంచి బయటకు పంపించారు.ఐదో వారం నైనికా బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఇక ఐదో వారమే బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎనిమిది మంది వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు.మెహబూబ్, హరితేజ, నాయని పావని, ముక్కు అవినాష్, గౌతమ్ కృష్ణ, రోహిణి, గంగవ్వ, టేస్టీ తేజ వంటి పాత కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా హౌస్‌లో అడుగుపెట్టారు.

వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన పాత కంటెస్టెంట్స్ ఓ గ్రూప్, ప్రస్తుతం హౌస్‌లో కొనసాగుతున్న సభ్యులంతా మరో గ్రూప్‌గా విభజించారు. ఇక చివరి వారం హౌస్ నుంచి కిర్రాక్ సీత ఎలిమినేట్ అయింది. ఏడో వారం హౌస్ నుంచి బయటకు రావడానికి కంటెస్టెంట్ల మధ్య పెద్ద యుద్దమే నడించింది. హరితేజ, ప్రేరణ, నిఖిల్, పృథ్వీరాజ్, గౌతమ్ కృష్ణ, యష్మి గౌడ, నబీల్ అఫ్రిది, టేస్టీ తేజా, నాగ మణికంఠ మొత్తం తొమ్మిది మంది నామినేషన్ అయ్యారు. వీరిలో ఎవరు బయటకు వస్తారా అని ప్రేక్షకులు ఎంతో అతృతగా ఎదురు చూస్తున్నారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పృథ్వీ హౌస్ నుంచి బయటకు వచ్చేసినట్టు తెలుస్తోంది. మొదటి నాలుగు వారాలు గేమ్ బాగా ఆడిన పృథ్వీ, వ్యక్తిగతంగా కొందరిపై కామెంట్స్ చేశారు. దీని కారణంగానే పృథ్వీకు ఓట్లు తక్కువ స్ధాయిలో పోల్ అయినట్టు తెలుస్తోంది. దీంతో ఈ వారం పృథ్వీ హౌస్ నుంచి రావడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది అఫిషీయల్‌గా ఆదివారమే తెలుస్తోంది.












Click it and Unblock the Notifications