ఊహించని కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేసిన బిగ్ బాస్
తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ 8వ సీజన్ ఘనంగా తన నాలుగు వారాలను పూర్తి చేసుకుంది. ఈసారి ప్రోమోలతోనే అదరగొట్టిన బిగ్‌బాస్ , దానికి మించిన కంటెంట్‌తో ఆకట్టుకుంటారని అంతా భావించారు.అయితే ఈ సీజన్‌లో పెద్దగా పేరున్న ఆర్టిస్టులు లేకపోవడంతో షో యామమాన్యంపై అభిమానులు పెదవి విరుస్తున్నారు.మరోవైపు కంటెస్టెంట్లు సైతం ఇప్పటి వరకు పెద్దగా ఆకట్టుకున్నట్టు కనిపించలేదు. హౌస్ మేట్స్ తమ స్టేటజీలతో గేమ్‌ను స్టార్ట్ చేశారు. కంటెస్టెంట్ల మధ్య గొడవలు మొదలయ్యాయి.అయితే ఈ గొడవలు చూడటానికి కొంచెం అతిగా అనిపించాయి.
వంట దగ్గర నుంచి హోస్ శుభ్రంగా ఉంచుకోవడం, బాత్ రూమ్స్ నీట్‌గా లేకపోవడం అంశాలపై హౌస్‌మెట్స్ మధ్య గొడవలు జరిగాయి. ఇక తొలివారం ఎలిమినేషన్‌లో భాగంగా బెజవాడ బేబక్క హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. రెండో వారంలో శేఖర్ భాషా ఎలిమినేట్ అయ్యారు. మూడోవారం హౌస్ నుంచి అభినవ్ బయటకు వచ్చేశారు. అయితే నాలుగోవారం ఎవరూ ఎలిమినేట్ అవుతారని ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

నాలుగో వారం హౌస్ నుంచి బయటకు రావడానికి కంటెస్టెంట్ల మధ్య పెద్ద యుద్దమే నడించింది. ఈ వారం నామినేట్ అయిన వారి లిస్ట్‌ను ఓసారి పరిశీలిస్తే.. నోబెల్ ,సోనియా,మణికంఠ,ఆదిత్య ఓం,పృద్వీ రాజ్, ప్రేరణ వీరంతా కూడా నామినేషన్‌లో కొనసాగుతున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హౌస్ నుంచి సోనియా ఆకుల బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. తక్కువ ఓట్లు నమోదు కావడంతో బిగ్‌బాస్ హౌస్ నుంచి సోనియా బయటకు వచ్చినట్టు సమాచారం అందుతోంది. ముఖ్యంగా విష్ణు ప్రియ మీద చేసిన కామెంట్స్ ప్రేక్షకుల్లో సోనియాపై నెగిటివిటీని క్రియేట్ చేసింది. విష్ణు ప్రియ డ్రెస్సింగ్ స్టైల్ మీద, నీకు ఎవరూ లేరంటూ ఆమె వ్యక్తిగతంగా కామెంట్స్ చేయడంతో సోనియా తీవ్ర విమర్శలను మూటగట్టుకుంది. దీని కారణంగానే ఆమె తొలిసారి నామినేషన్‌లో నిలిచినప్పటికి ఎలిమినేట్ అయిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అఫిషీయల్‌గా సోనియా హౌస్ నుంచి ఆదివారమే బయటకు రావడం జరుగుతోంది.












Click it and Unblock the Notifications