సీజన్ మొత్తం కెప్టెన్ లేకుండానే..మొదటి రోజునే బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్..
తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ 8వ సీజన్ ఘనంగా ఆరంభం అయింది.గత సీజన్లకు భిన్నంగా ఈ సీజన్ ఉండబోతుందని ప్రోమోను చూస్తేనే అర్థం అయింది. దానికి తగ్గట్టుగానే మొదటి రోజే ట్విస్ట్‌లతో బిగ్‌బాస్ అదరగొట్టారు. సింగిల్‌గా వెళ్లడానికి వీల్లేదని నాగార్జున కంటెస్టెంట్లకు తేల్చి చెప్పారు. మీరు కపుల్స్ లాగే వెళ్లండి.. మీ ఇష్టమొచ్చినట్టు మీరు కథలు నడిపించుకోండంటూ వాళ్ళకి కావాల్సిన కంటెంట్ వాళ్లకి ఇవ్వండని కంటెస్టెంట్లకు నాగార్జునకు తేల్చి చెప్పారు.సీజన్ ఆరంభం రోజునే ఎలిమినేషన్ ఉందని చెప్పడం సంచలనంగా మారింది. అలాగే బిగ్‌బాస్ 8వ సీజన్ మొత్తం కెప్టెన్ లేకుండానే షో సాగుతుందని బిగ్‌బాస్ తేల్చేశారు.

ఎన్టీఆర్ ''దేవర''లోని పాటతో ఎంట్రీ ఇచ్చారు కింగ్ నాగార్జున. ఈ సీజన్ మొదటి కంటెస్టెంట్‌గా సీరియల్ యాక్టర్ యష్మీ గౌడ ఎంట్రీ ఇచ్చారు. సీరియల్ యాక్టర్స్ నిఖిల్ రెండో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు. మూడో కంటెస్టెంట్‌గా కమెడియన్ అభియ్ నవీన్ , నాలుగో కంటెస్టెంట్‌గా సీరియల్ యాక్టర్ ప్రేరణ బిగ్‌బాస్‌లో అడుగుపెట్టారు. ఐదో కంటెస్టెంట్‌గా ''లాహిరి లాహిరి లాహిరీలో'' సినిమా హీరో ఆదిత్య ఓం ఎంట్రీ ఇచ్చారు. ఆరో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు యాక్టర్ సోనియా ఆకుల. ఆమెకు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మద్దతు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను సైతం బిగ్‌బాస్‌లో ప్లే చేశారు. .ఏడో కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్‌లో అడుగుపెట్టారు ప్రముఖ యూట్యూబర్, యాక్టర్ బెజవాడ బేబక్క. ఎనిమిదో కంటెస్టెంట్‌గా ఆర్‌జే శేఖర్ భాషా బిగ్‌బాస్‌లో అడుగుపెట్టారు.తొమ్మిదో కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇచ్చింది 7ఆర్ట్స్ సీత. పదో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు సీరియల్ యాక్టర్ నాగ మణికంఠ.












Click it and Unblock the Notifications