బిగ్ బాస్‌లోకి హాట్ బ్యూటీ ఎంట్రీ..ఇక రచ్చ రచ్చే
తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ 8వ సీజన్ పెద్దగా ఆకట్టుకున్నట్టు కనిపించడం లేదు.గత సీజన్లకు భిన్నంగా ఈ సీజన్ సాగుతుందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు.ఈసారి ప్రోమోలతోనే అదరగొట్టిన బిగ్‌బాస్ , దానికి మించిన కంటెంట్‌తో ఆకట్టుకుంటారని అంతా భావించారు. అయితే ఈసారి షోకు వచ్చిన వారిలో సగానికి పైగా ప్రేక్షకులకు తెలియనివారే. దీంతో షోపై ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి కలగడం లేదు. దీనికి తోడు ఈసారి హౌస్‌మెట్స్ ప్రవర్తన కూడా షోపై వ్యతిరేకత ఏర్పడేలా చేసింది.
కంటెస్టెంట్ల మధ్య వచ్చే గొడవలు చూడటానికి కొంచెం అతిగా అనిపించాయి. వంట దగ్గర నుంచి హోస్ శుభ్రంగా ఉంచుకోవడం, బాత్ రూమ్స్ నీట్‌గా లేకపోవడం అంశాలపై హౌస్‌మెట్స్ మధ్య గొడవలు జరిగాయి. ఇక తొలివారం ఎలిమినేషన్‌లో భాగంగా బెజవాడ బేబక్క హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. రెండో వారంలో శేఖర్ భాషా ఎలిమినేట్ అయ్యారు. మూడోవారం హౌస్ నుంచి అభినవ్ బయటకు వచ్చేశారు. నాలుగోవారం ఎవరూ సోనియా ఆకుల ఎలిమినేట్ అయ్యారు. ఇక వారంలో వైల్డ్ కార్డు ఎంట్రీస్ ఉంటాయని ముందునుంచి చెబుతూ వస్తున్నారు. దీనిలో భాగంగానే ఏకంగా ఎనిమిది వైల్డ్ కార్డు ఎంట్రీస్ ఉంటాయని సమాచారం అందుతోంది.

దీంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్‌లోకి వచ్చే ఆ ఎనిమిది కంటెస్టెంట్స్ ఎవరా అని బిగ్ బాస్ లవర్స్‌లో ఉత్కంఠ నెలకొంది. తాజాగా సమాచారం అందుతున్న ప్రకారం మెహబూబు, హరితేజ, నైనీ పావని, ముక్కు అవినాష్, గౌతమ్ కృష్ణ, రోహిణి, గంగవ్వ, టేస్టీ తేజ ఉంటారని తెలుస్తోంది. ఇప్పటికి వీరికి సంబంధించిన స్క్రీన్ టెస్ట్ అన్ని కూడా జరిగాయని తెలుస్తోంది. అయితే వీరందర్ని ఒక్కసారే కాకుండా ముగ్గురు లేదా నలుగుర్ని కలిపి హౌస్‌లో పంపించే యోచనలో బిగ్ బాస్ ఉన్నట్టు సమాచారం. మొదటి సీజన్‌లో అందర్ని ఆకట్టుకున్న హరితేజ మరోసారి హౌస్‌లో అడుగుపెట్టనున్నారు.
ఇక ఈ వారమే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందని గత వారమే నాగార్జున్ హింట్ ఇచ్చారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హీరో ఆదిత్య ఓం హౌస్ నుంచి బయటకు వచ్చినట్టు సమాచారం అందుతోంది. భారీ అంచనాల మధ్య బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన ఆదిత్య ఓం, అభిమానులు ఆకట్టుకోవడంలో ఘోరంగా ఫెయిల్ అయ్యారు. మొదటి వారంలో అయితే ఆదిత్య ఓం అసలు హౌస్‌లో ఉన్నారా అనే అనుమానం కూడా కలిగింది.
నాగార్జున సైతం ఇదే విషయాన్ని ఆదిత్య ఓం దగ్గర ప్రస్తావించారు. అయినప్పటికీ తన ఆట తీరును మార్చుకొని ఆదిత్య ఓం హౌస్ నుంచి బయటకు వెళ్లడానికి మరోసారి నామినేషన్‌లో నిలిచారు. మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో భాగంగా ఆదిత్య ఓంను బిగ్ బాస్ నుంచి బయటకు పంపించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఎపిసోడ్ గురువారం ప్రసారం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి వైల్డ్ కార్డు ఎంట్రీస్ ద్వారా అయినా షోకు హైప్ పెరుగుతుందేమో చూడాలి.












Click it and Unblock the Notifications