బిగ్ బాస్‌లోకి దివ్వెల మాధురి వచ్చేసిందిరోయ్ ..అలేఖ్య చిట్టి పాప కూడా
బిగ్ బాస్ ఈ సీజన్ ఆసక్తికరంగా ముందుకు సాగుతున్నా, గత సీజన్‌లలో మాదిరిగా కంటెస్టెంట్స్ మధ్య వ్యక్తిగత వైరం, ఎప్పటికీ చల్లారని ఫైటింగ్ లేకపోవడం సీజన్‌పై కొంత ప్రభావం చూపుతోంది. చిన్న గొడవలు పడినా, మరుక్షణమే కలిసిపోవడంతో టీఆర్పీ రేటింగ్‌లు ఆశించిన స్థాయిలో లేవని బిగ్ బాస్ టీమ్ గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ లోపాన్ని సరిదిద్దడానికి, హౌస్‌లో నిజమైన ఫైర్ పుట్టించడానికి బిగ్ బాస్ సరికొత్త ప్లాన్‌తో సిద్ధమైంది. రేపటి ఎపిసోడ్ ద్వారా ఏకంగా ఆరుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌ను హౌస్‌లోకి పంపబోతున్నట్టు సమాచారం. వీరిని బిగ్ బాస్ టీమ్ ప్రత్యేకంగా 'ఫైర్ స్ట్రోమ్' అని సంబోధిస్తోంది.
హౌస్‌లోకి అడుగుపెట్టబోయే 6 మంది కంటెస్టెంట్స్ వీరే
ఆయేషా
ఈమె ఒక టాప్ సీరియల్ నటి. గతంలో బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్ సరసన 'ఊర్వశివో.. రాక్షసివో' సీరియల్‌లో నటించింది.ముఖ్యంగా, తమిళ బిగ్ బాస్‌లో నెల రోజులు ఉండి గొడవలు పడడంలో దిట్టగా పేరు తెచ్చుకుంది. అబ్బాయిలకు సమానంగా గేమ్స్ ఆడుతూ, గ్లామర్‌తో ఆకర్షించగల సత్తా ఈమె సొంతం.

అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య
సోషల్ మీడియా ఫాలోవర్లకు ఈ పేరు సుపరిచితమే. 'పికిల్స్' వ్యాపారంతో ఎదిగిన ముగ్గురు అక్కాచెల్లెళ్లలో ఈమె ఒకరు.రీసెంట్‌గా ఒక కస్టమర్‌తో జరిగిన ఆడియో లీక్ వివాదంతో తీవ్ర నెగిటివిటీని ఎదుర్కొంది. గొడవలు పడడంలో ముందు ఉండే రమ్య, హౌస్‌లో ఏ స్థాయిలో ఫైర్ చూపిస్తుందో చూడాలి.
దివ్వెల మాధురి
శాసన మండలి సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్ సతీమణిగా సోషల్ మీడియాలో ఈమెకు ఒక రేంజ్ పాపులారిటీ ఉంది. పాలిటిక్స్ ,సోషల్ స్టేటస్ కలగలిపిన ఈమె, హౌస్‌లో తన గేమ్ ప్లాన్‌తో ఎలా ముందుకు వెళ్తుందో ఆసక్తిగా మారింది.
నిఖిల్ నాయర్
గతంలో 'గృహలక్ష్మి', 'పలుకే బంగారమాయే' వంటి స్టార్ మా సీరియల్స్‌లో హీరోగా నటించి పాపులారిటీ తెచ్చుకున్నాడు. హౌస్‌లో లవర్ బాయ్‌గా మారతాడా లేక గొడవలు సృష్టిస్తాడా అనేది చూడాలి.
శ్రీనివాస్ సాయి
'గోల్కొండ హై స్కూల్' వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి, ఆ తర్వాత పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణించాడు. సినిమా నేపథ్యం ఉన్న శ్రీనివాస్ గేమ్ ఎలా ఉంటుందోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
గౌరవ్ గుప్తా
స్టార్ మా ఛానల్‌లో ప్రసారమయ్యే 'గీత LLB' సీరియల్‌లో హీరోగా నటించి పాపులర్ అయిన గౌరవ్ గుప్తా కూడా వైల్డ్ కార్డ్‌గా వస్తున్నాడు.
ఈ ఆరుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌ను 'ఫైర్ స్ట్రోమ్'గా పరిచయం చేస్తున్న బిగ్ బాస్ టీమ్, వీరి ఎంట్రీ తర్వాత హౌస్‌లో ఎలాంటి మాటల యుద్ధం, భావోద్వేగ ఘర్షణలు మొదలవుతాయో చూడాలి. మొత్తానికి, సీజన్ 9కు ఊహించని మలుపు రావడం ఖాయం.












Click it and Unblock the Notifications