బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ షో ప్రసార టైమింగ్స్‌లో మార్పులు..
బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ చివరి దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ 8 తెలుగు ముగియనుంది. బిగ్‌బాస్ 8 సీజన్ విన్నర్ ఎవరో మరికొద్దిరోజుల్లో తెలియనుంది. మరోరెండు వారాల్లో గ్రాండ్ ఫినాలే ఉండగా, బిగ్‌బాస్ అభిమానులకు షాకింగ్ న్యూస్ అందింది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ప్రసార టైమింగ్స్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. మాటీవీలో ప్రతిరోజూ రాత్రి 9.30 గంటలకు ప్రసారమయ్యే ఈ షో నేటి (సోమవారం) నుంచి రాత్రి పదిగంటలకు ప్రసారం కానుంది.
టాప్ 5లో ఎవరు..
బిగ్‌బాస్ ప్రతి సీజన్‌లాలాగే, ఈసారి కూడా గ్రాండ్ ఫినాలే నిర్వహించి బిగ్ బాస్ తెలుగు 8 విజేతను షో నిర్వాహకులు ప్రకటించనున్నారు. ఇదిలా ఉండగా ఈ సీజన్ పదమూడో వారం టేస్టీ తేజ, పృథ్వీరాజ్ ఇద్దరూ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. వీరి ఎలిమినేషన్‌తో ప్రస్తుతం బిగ్ బాస్ ఇంట్లో ఏడుగురు కంటెస్టెంట్స్ కొనసాగతున్నారు. అందులో జబర్దస్త్ అవినాష్, గౌతమ్ కృష్ణ, నిఖిల్ మలియక్కల్, నబీల్ అఫ్రీది, ప్రేరణ, విష్ణుప్రియ, రోహిణి ఉన్నారు. వీరిలో టాప్ 5లో ఎవరుంటారో అనేది అభిమానుల్లో ఆస్తక్తి నెలకొంది. ఇక, వచ్చేవారు ఇంటి నుంచి బయటికి ఎవరు వెళ్లనున్నారో అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.

రాత్రి 10 గంటలకు ప్రసారం..
బిగ్ బాస్ 8 తెలుగు గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌ను ఈ నెల (డిసెంబర్) 15 వ తేదిన నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అది కూడా బిగ్ ఆదివారం నాడు రాత్రి 7 గంటల నుంచి ఈ ఎపిసోడ్ ప్రసారం కానున్నట్లు సమాచారం. ఈ గ్రాండ్ ఫినాలేలో స్టార్ హీరోయిన్స్‌తో డ్యాన్సులు, సెలబ్రిటీలు, సింగర్స్ సింగింగ్ పర్ఫామెన్స్‌లు వంటివన్నీ ఉండబోతున్నాయి. ఇక, ఈ సారి బిగ్‌బాస్ ట్రోఫిని ఎవరు అందిస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. గత సీజన్‌లో నాగార్జునే ఆ ట్రోపిని అందించిన సంగతి తెలిసిందే. ఈ సారి ప్రత్యేక అతిథి వస్తారా? లేక నాగార్జునతోనే ఇప్పిస్తారేమో చూడాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా, షో ప్రసార టైమింగ్స్‌లో మార్పులు చేశారు. బిగ్‌బాస్ స్టార్ మా టీవీ ఛానెల్‌లో రాత్రి 9.30 గంటలకు ప్రసారమయ్యేది. కానీ, ఇక నుంచి రాత్రి 10 గంటలకు బిగ్ బాస్ షోను ప్రసారం చేయనున్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications