Barrelakka: బిగ్ బాస్ విన్నర్‍తో బర్రెలక్క పెళ్లి.. ఏం మనుషులు మీరు అంటూ ఫైర్..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేశారు బర్రలక్క(Barrelakka). ఈ ఎన్నికల్లో బర్రెలక్క కొల్లాపూర్ నుంచి పోటీ చేశారు. దీంతో ఆమె అప్పట్లో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచారు. అయితే ఎన్నికల్ల బర్రెలక్క ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ ఆమె చాలా మందిని ఆలోచింపజేశారు. ఆ తర్వాత అప్పుడప్పుడు వార్తుల్లో నిలుస్తున్నారు బర్రెలక్క.
తాజాగా ఆమె రూమర్ పై స్పందించారు. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) తో బర్రెలక్క పెళ్లంటూ సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది. దీనిపై బర్రెలక్క మాట్లాడారు. ఓ యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ఇంటర్ప్యూలో పాల్గొన్నారు. యాంకర్ పల్లవి ప్రశాంత్ తో బర్రెలక్క పెళ్లంటూ సోషల్ మీడియాలో జరుగుతుందని అడిగారు. దీనిపై బర్రెలక్క స్పందిస్తూ.. తనకు ప్రశాంత్ కు పెళ్లి అనే వార్త వినలేదని చెప్పారు.

కొన్ని యూట్యూబ్ ఛానళ్లల్లో వ్యూస్ కోసం ఇలా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రశాంత్ ను తను అన్న అని పిలుస్తానని పేర్కొన్నారు. తను ఏ యూట్యూబ్ ఛానల్ పై స్ట్రైక్ కానీ, కాపీ రైట్ కూడా వేయలేదని బర్రెలక్క చెప్పారు. మనం మంచి పని చేస్తే మీడియా నుంచి కచ్చితంగా మద్దతు ఉంటుందన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బర్రెలక్క వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
నాగర్ కర్నూలు లోక్ సభ స్థానంలో పోటీ చేస్తానని పేర్కొన్నారు.గెలిచే వరకు తన పోరాటం కొనసాగుతుందన్నారు. నిరుద్యోగుల కోసం పోరాటం కొనసాగిస్తానని బర్రెలక్క స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications