హుక్కా సేవిస్తూ పోలీసులకు పట్టుబడిన బిగ్‌బాస్ విజేత..?
బిగ్‌బాస్ విన్నర్ హుక్కా సేవిస్తూ పోలీసులకు దొరికిపోయాడు. హిందీ బిగ్‌బాస్ 17 విన్నర్ మున్నావర్ ఫరూఖీని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. ముంబైలోని ఫోర్ట్ ప్రాంతంలోని బోరా బజార్ ఏరియాలో ఉన్నఓ ప్రముఖ హోటల్‌లో నిన్నరాత్రి పోలీసులు రైడ్ చేశారు. ఆ సమయంలో బిగ్‌బాస్ విన్నర్ ఫరూఖీ హుక్క సేవిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయినట్లు తెలుస్తోంది. ఫరూఖీతో పాటు మరో13 మంది కూడా అక్కడే హుక్కా సేవిస్తూ పట్టుపడ్డారని సమచారం. అయితే, ఇది బెయిలబుల్ నేరం కావడంతో పోలీసులు వారిని నోటీసుతో విడుదల చేసినట్లు సమాచారం.
హెర్బల్ హుక్కా పేరుతో పోగాకు ఆధారిత హుక్కా సేవిస్తున్నట్లు ముంబై పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో ముంబై పోలీసులు మంగళవారం రాత్రి 10.30 నిమిషాల సమయంలో ముంబయిలోని బోరా బజార్ ఏరియాలో ఉన్న ప్రముఖ హోటల్లోని హుక్కా పార్లర్ పై రైడ్ చేశారు. ఈ రైడ్ సమయంలో హిందీ బిగ్ బాస్17 విజేత మున్నవార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈయనతో పాటు పదమూడు మందిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సోదాలో 4400 రూపాయల నగదుతో పాటు 9 హుక్కా పాత్రలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు 17,900 రూపాయల విలువైన వస్తువులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎంఆర్‌ఏ మార్గ్ పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. పొగాకు ఉత్పత్తుల చట్టంతో పాటు ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్లు 283, 336 కింద కేసులు నమోదు చేసినట్ల పోలీసాధికారి ఒకరు తెలిపారు.

స్టాండప్ కమెడీయన్‌గా మంచి పేరు..
స్టాండప్ కమెడీయన్‌గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన మున్నవార్ ఫరూఖీ హీందీ బిగ్‌బాస్ 17 కి వెళ్లి విజేతగా నిలిచారు. బిగ్‌బాస్‌తో ఫరూఖీ మంచి పాపురాలిటి తెచ్చుకున్నారు. అయితే, హుక్కా పార్లర్ లో జరిగిన దాడితో మున్నావర్ కు ఎలాంటి సంబంధం లేదని ఆయన టీం వివరించింది. కానీ పోలీసులు మాత్రం హుక్కా పార్లర్ లో జరిగిన దాడిలో తాము అదుపులోకి తీసుకున్నవారిలో బిగ్‌బాస్ విన్నర్ మున్నావర్ ఫరూఖీ ఉన్నారని మీడియాకు తెలిపారు. హుక్కా పార్లర్‌లో ముంబై పోలీసుల సామాజిక సేవల విభాగం దాడి చేసి 14 మందిని అదుపులోకి తీసుకుంది. అయితే, పోలీసులు వీరందరినీ విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు మునవ్వర్ ఫారూఖీని నోటీసుతో విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఈ అరెస్టు విషయంపై బిగ్‌బాస్ విజేత ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే..!
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications