'ధురంధర్' కంటే బిగ్ ప్రాజెక్ట్.. RGV కొత్త సినిమా ప్రకటన!

భారతీయ సినిమా ఇండస్ట్రీలో సెన్సేషనల్ డైరెక్టర్‌గా పేరొందిన రామ్ గోపాల్ వర్మ(ఆర్జీవీ) మరో ప్రతిష్టాత్మక సినిమాకు శ్రీకారం చుట్టారు. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ మోహిత్ సూరితో జతకట్టి ఓ భారీ స్థాయి సినిమాను నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకు రామ్ గోపాల్ వర్మ కథను అందించడంతో పాటు సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తుండగా.. మోహిత్ సూరి దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ ప్రకటన బాలీవుడ్ వ్యాప్తంగా సినీ ప్రియుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది.

'వారణాసి' మూవీ నుంచి లీకైన పిక్.. సోషల్ మీడియా షేక్..
'వారణాసి' మూవీ నుంచి లీకైన పిక్.. సోషల్ మీడియా షేక్..

దావూద్, చోటా రాజన్ గ్యాంగ్ వార్ నేపథ్యం
ఈ సినిమా కథ ముంబై అండర్ వరల్డ్ చరిత్రలోనే అత్యంత అపఖ్యాతి పాలైన కాలం నేపథ్యంలో ఉండబోతోందని ఆర్జీవీ వెల్లడించారు. భారత నేర చరిత్రను మలుపు తిప్పిన దావూద్ ఇబ్రహీం, చోటా రాజన్ ముఠాల మధ్య విడిపోవడం, వారి మాధ్య తలెత్తిన తీవ్ర విభేదాల ఆధారంగా ఈ కథ సాగుతుంది. ఈ గ్యాంగ్ వార్‌లో 'సౌత్య' అనే వ్యక్తి పాత్రతో పాటు 1993 ముంబై వరుస బాంబు దాడుల అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు, భారత నిఘా ఏజెన్సీలు నిర్వహించిన సీక్రెట్ ఆపరేషన్లను కూడా ఈ సినిమాలో నిశితంగా చూపించనున్నారు.

Bigger Than Dhurandhar Ram Gopal Varma Announces New Film With Mohit Suri Based on Mumbai Underworld

మొహిత్ సూరి విలక్షణమైన మేకింగ్ స్టైల్
సాధారణంగా మోహిత్ సూరి అంటేనే 'ఆషిఖీ 2', 'ఏక్ విలన్', 'మలంగ్' వంటి మోస్ట్ ఎమోషనల్ అండ్ రొమాంటిక్ సినిమాలక్ ప్రసిద్ధి చెందారు. అయితే ఇంతటి తీవ్రమైన అండర్ వరల్డ్, నేర నేపథ్యం ఉన్న కథకు మోహిత్ తనదైన శైలిలో భావోద్వేగాలను, అద్భుతమైన సంగీతాన్ని, రియలిస్టిక్ యాక్షన్ సీన్లను జోడించి తెరకెక్కించనున్నారని రామ్ గోపాల్ వర్మ కొనియాడారు. రొమాంటిక్ జోనర్‌తో అలరించే మోహిత్ సూరి.. ఈ క్రైమ్ అండ్ ఇంటెలిజెన్స్ థ్రిల్లర్‌ను ఎలా తీర్చిదిద్దుతారో చూడటం ఎంతో ఆసక్తికరంగా మారనుంది.

పెద్ద స్టార్స్ చేయాల్సిన సినిమా ఇది.. స్నేహం, థ్రిల్, ట్విస్టుల కాంబినేషన్!
పెద్ద స్టార్స్ చేయాల్సిన సినిమా ఇది.. స్నేహం, థ్రిల్, ట్విస్టుల కాంబినేషన్!

హాలివుడ్ పోలికలు
సినిమా నాణ్యత, విజన్ గురించి రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తమను తాము హాలీవుడ్ దిగ్గజాలతో పోల్చుకోవడం లేదని చెప్తూనే.. ఒకవేళ ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా 'జాస్' సినిమా తీసినా లేదా స్టీవెన్ స్పీల్‌బర్గ్ 'ది గాడ్‌ఫాదర్'కు దర్శకత్వం వహించినా ఆ కాంబినేషన్ ఫలితం ఎలా ఉంటుందో.. ఈ ప్రాజెక్టు కూడా అలాగే ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ సినిమా 'ధురంధర్' కంటే భారీ స్థాయిలో ఆర్జీవీ క్లాసిక్ 'సత్య' సినిమా కంటే వాస్తవికతకు దగ్గరగా ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

నటీనటుల ఎంపికపై నెలకొన్న ఆసక్తి
స్టోరీ, దర్శకత్వానికి సంబంధించిన వివరాలు వెలుగులోకి రావడంతో ఈ పవర్‌ఫుల్ క్రైమ్ డ్రామాలో ఎవరిని నటీనటులుగా ఎంపిక చేస్తారనే దానిపై సినీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ముంబై అండర్ వరల్డ్, 1993 దాడుల తదనంతర పరిస్థితులు, భారత గూఢచార సంస్థల పాత్ర చుట్టూ తిరిగే ఈ విలక్షణ చిత్రం, హిందీ చిత్రసీమలో ఓ సరికొత్త రికార్డుగా నిలిచే అవకాశముంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+