Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఫ్లాపుల్లో దీన్ని కొట్టే సినిమా మరొకటి ఉండదు..!

2024వ సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. ఇంకా కొన్ని రోజుల్లో 2025 మొదలుకాబోతుంది. ఈ సమయంలో 2024లో చాలానే మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నుంచి ఒలింపిక్స్ వరకు, ఐపీఎల్ నుంచి వరల్డ్ కప్ వరకు ఇలా అనేక రకాల సంఘటనలు ఈ 2024లో చోటు చేసుకున్నాయి. అలాగే ఎంతో మంది ఈ సంవత్సరం సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. అలాగే 2024లో కొందరు సెలబ్రిటీలు తమ సినిమాలతో వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా డిజాస్టర్ సినిమాలను పరిశీలిస్తే..2024లో మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన 'మట్కా'సినిమా మొదటి స్థానంలో నిలిచింది.

'మట్కా'గురించి ఎంత చెప్పుకుంటే అంత తక్కువ. మాస్ ఎంటర్‌టైనర్‌‌గా తెరకెక్కిన సినిమాపై వరణ్ తేజ్ భారీ ఆశలనే పెట్టుకున్నాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఎంతలా అంటే మెగా అభిమానులే సినిమాకు దూరంగా ఉన్నారంటే 'మట్కా' ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాకు దారుణంగా రూ.64 లక్షల రూపాయిలు మాత్రమే వసూలు చేసినట్టు లెక్కలు చెబుతున్నాయి. కెరీర్ స్టార్టింగ్‌లో వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు వరుణ్ తేజ్. ఇదే సమయంలో మెగా ట్యాగ్‌కు సైతం ఆయన దూరంగా ఉన్నట్టు కనిపించారు.

Biggest disaster movie in 2024 in telugu

కథబలం ఉన్న సినిమాలు చేస్తూ యంగ్ హీరోల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. ముకుందా సినిమాతో ఇండస్ట్రీకి పరిచియం అయిన వరుణ్ తేజ్, ఫిదా సినిమాతో బ్లాక్ బ్లాస్టర్ హిట్ కొట్టాడు. కంచె, తొలిప్రేమ, f2,f3, గద్దలకొండ గణేష్, అంతరిక్షం వంటి వరుస హిట్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే గత కొంతకాలంగా వరుణ్ తేజ్ కెరీర్ గాడి తప్పింది. వరుణ్ తేజ్ నుంచి నుంచి సరైన సినిమాలు రావడం లేదు.వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నాడు. గని, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్ వంటి సినిమాల ప్లాప్‌లతో వరుణ్ తేజ్ కెరీర్‌కు బాగా డ్యామేజ్ జరిగింది. వరుణ్ తేజ్ కెరీర్‌లోనే మట్కా సినిమా అత్యంత భారీ డిజాస్టర్‌గా సినీ పండితులు తేల్చేస్తున్నారు. వరుస ప్లాప్‌లతో ఈ మెగా హీరో డబుల్ హ్యాట్రిక్‌ ప్లాప్‌లకు బాటలు వేసినట్టు అయింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+