'బైకర్' మూవీ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్.. 2 నెలల్లో 2 హిట్లు నీకే సాధ్యం అన్నా..!

టాలీవుడ్ ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా 'నారీ నారీ నడుమ మురారి' సినిమాతో హిట్ కొట్టిన ఈ యంగ్ హీరో రెండు నెలల వ్యవధిలోనే మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల మందుకు వచ్చాడు. అదే 'బైకర్' మూవీ.. ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి శర్వానంద్ 'బైకర్'మూవీపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ట్రైలర్ లో బైక్ రేసింగ్ సీక్వెన్స్ లు ఉత్కంఠభరితంగా ఉండటం.. హాలీవుడ్ విజువల్స్ ఈ మూవీలో కనిపించడం.. అంతేకాక ఈ మూవీలో టాలీవుడ్ సీనియర్ హీరో రాజ శేఖర్ కూడా కీలక పాత్ర చేయడంతో సినిమాపై పాజిటివ్ బజ్ విపరీతంగా ఏర్పడింది. మరి ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ స్పోర్ట్స్ అడ్వెంచర్ మూవీ ప్రేక్షకుల అంచనాలను రీచ్ అయిందా..?

'బైకర్' మూవీపై హీరో శర్వానంద్ ఎంత క్లారిటీగా ఉన్నాడో ఇటీవల ప్రీ రిలీజ్ వేడుకలో ఆయనే స్పష్టంగా చెప్పాడు. మొన్న 'నారీ నారీ నడుమ మురారి' సినిమాతో చెప్పి మరీ హిట్ కొట్టానని.. 'బైకర్‌'తో బ్లాక్‌ బస్టర్‌ కొట్టబోతున్నానని చెప్పాడు.. అయితే శర్వా చెప్పి మరీ రెండో సారి హిట్ కొట్టడం ఆయనకే సాధ్యం. స్టోరీ, కంటెంట్ పై శర్వాకు ఉన్న నమ్మకం అలాంటిది మరి. 'బైకర్' మూవీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న శర్వానంద్.. ఈ మూవీకోసం చాలా కష్టపడ్డాడు. ఆ ఫలితం స్క్రీన్ పైన కనపడుతుందని చెప్పొచ్చు. ఇక ఈ మూవీలో బైక్ రేసింగ్ సీక్వెన్స్ లు హాలీవుడ్ రేంజ్ లో గ్రాండ్ గా ఉన్నాయి. ఇలాంటి సినిమా తెలుగులో రాలేదనే చెప్పాలి. ఇక ఫుల్ రివ్యూ చూస్తే..

సునీల్ నారాయణ్(రాజశేఖర్) ఓ మాజీ మోటో క్రాస్ రేసర్. అయితే భారత్ లో ఈ ఆటకు సరైన ప్రోత్సాహం, ప్రాధాన్యం లేకపోవడం వల్ల మరో స్థాయికి వెళ్లలేకపోతాడు. అందుకే దేశంలో మోటోక్రాస్ రేసింగ్ కు గుర్తింపు తీసుకు రావాల‌ని తపిస్తుంటాడు. ఈ క్రమంలోనే మోటోక్రాస్ రేస‌ర్ల‌ని తీర్చిదిద్దే ప‌నిలో ఉంటాడు. అయితే సునీల్ నారాయణ్ కుమారుడే వికాశ్ నారాయణ్ (శర్వానంద్).. తండ్రి వద్దే ట్రైనింగ్ తీసుకుంటాడు వికాస్. తండ్రి సునీల్ స్ఫూర్తితో అంత‌ర్జాతీయ స్థాయి రేసింగ్‌ లోనూ పాల్గొంటాడు. కానీ కొన్ని కారణాలతో మూడో స్థానంలో నిలుస్తాడు విక్కీ. ఆ తర్వాత రేసింగ్ కు దూరంగా ఉండాలని విక్కీ షాకింగ్ డెసిషన్ తీసుకుంటాడు.

ఈ క్రమంలో తండ్రీ కొడుకుల మధ్య ఏం జరిగింది..? విక్కీ రేసింగ్ కు దూరంగా ఎందుకు ఉండాలని అనుకుంటాడు..? అనన్య (మాళవిక నాయర్) విక్కీ లైఫ్ లోకి ఎలా వచ్చింది..? కొన్నేళ్ల తర్వాత విక్కీ మళ్లీ రేసింగ్ స్టార్ట్ చేయడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి..? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.. ఇక దర్శకుడు మోటోక్రాస్ రేసింగ్ ను ఎంచుకోవడంతో సినిమా మొత్తం కొత్తగా ఉంటుంది. స్పోర్ట్స్ మూవీస్ లో ఉండే ఎమోషన్స్, ఘర్షణలు, డ్రామా అంతా 'బైకర్' మూవీలో ఉంటుంది. ముఖ్యంగా రేసింగ్ సీక్వెన్స్ లు చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి.

ఇక మూవీ ఫస్టాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగున్నట్లు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. రేసింగ్ సీక్వెన్స్ లు, తండ్రీ త‌న‌యుల మధ్య వచ్చే ఎమోషన్స్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ అని చెప్పొచ్చు. శర్వానంద్, రాజశేఖర్ తమ పాత్రలకు ప్రాణం పోశారు. అలాగే నటి మాళవిక నాయర్ కూ మంచి పాత్ర దక్కింది. అయితే స్పోర్ట్స్ సీక్వెన్స్ ల మీద పెట్టిన శ్రద్ధ దర్శకుడు ఎమోషన్స్ మీద కాస్త ఎక్కువగా పెట్టి ఉంటే సినిమా మరో రేంజ్ లో ఉండేదని టాక్ వినిపిస్తోంది. కానీ బైక్ రేసింగ్ కథతో సినిమాను తెరకెక్కించిన విధానానికి దర్శకుడి హాట్సాఫ్ చెప్పొచ్చు.

Biker Movie Review A Blockbuster Hit with Thrilling Racing Sequences and Emotional FatherSon Bond

ఇక బైకర్ మూవీకి జిబ్రాన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్దిరిపోయింది. సినిమాటోగ్రఫీ బాగుంది. యూవీ క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. మొత్తానికి ఈ వీకెండ్ కు బెస్ట్ సినిమా అని చెప్పొచ్చు. బైకర్ మూవీ రేటింగ్: 3.25/5

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+