ప్రభాస్ సినిమాలో గ్లామర్ క్వీన్.. ఇప్పుడెలా మారిపోయిందో చూస్తే మతిపోద్ది! (వీడియో)

దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో నమిత ఒకరు. ఒకప్పుడు తన అందం అభినయంతో ప్రేక్షకులను కవ్వించిన ఈ ముద్దుగుమ్మ.. చేసింది తక్కువ చిత్రాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం నమిత సినిమాలకు దూరంగా ఉంటున్నారు. పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఒకప్పుడు బొద్దుగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. తాజా లుక్ చూసి అభిమానులంతా షాకవుతున్నారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న నమిత.. తాజాగా జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ కనిపించింది. తాను పూర్తిగా సన్నబడ్డానని అందరికీ తెలిసేలా నమిత ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో నమిత షేర్ చేసిన ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడయాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో చాలా సన్నగా, నాజూగ్గా తయారయ్యారని అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ లుక్ తో నమిత సినిమాల్లోకి వస్తే బాగుంటుందని కొందరు సలహాలు ఇస్తున్నారు.

స్టార్ క్రికెటర్ తో మృణాల్ ఠాకూర్ డేటింగ్..! ఇదేం ట్విస్టురా సామి..
స్టార్ క్రికెటర్ తో మృణాల్ ఠాకూర్ డేటింగ్..! ఇదేం ట్విస్టురా సామి..

గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో జన్మించిన నమిత.. చిన్ననాటి నుంచి సినిమాలపై ఆసక్తితోనే మోడలింగ్ నుంచి సినిమాలవైపు అడుగులు వేసింది. తెలుగులో ఆర్యన్ రాజేష్ హీరోగా నటించిన 'సొంతం' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. తొలి చిత్రంతోనే నటిగా సూపర్ హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ సినిమా తర్వాత వెంకటేష్ హీరోగా వచ్చిన జెమినీ సినిమాలో నటించంది. ఆ సినిమా కాస్త ఆడకపోయినా నమితకు మాత్రం భారీ భాలోయింగ్ వచ్చింది. ఆ తర్వాత ఐతే ఏంటీ!, నాయకుడు వంటి సినిమాల్లో నటించింది. ఆ తర్వాత రవితేజతో ఒకరాజు ఒకరాణి సినిమాలో నటించింది. అలాగే ప్రభాస్ నటించిన బిల్లా చిత్రంలో గ్లామరస్ బ్యూటీగా కనిపించింది. అలాగే బాలయ్య సింహా సినిమాలో నటించి ఓ స్పెషల్ సాంగ్ చేసి మెప్పించింది. తెలుగులో సినిమాలు చేసినా కూడా తెలుగులో ఈ భామకు కోరుకున్న క్రేజ్ మాత్రం రాలేదు.

Billa Actress Namitha Shocking Body Transformation Viral Gym Workout Video Stuns Fans Details
Oh..! Sukumari First Review: రెండు నెలలకో హిట్టు కొడతావ్.. ఎలా అన్నా..?
Oh..! Sukumari First Review: రెండు నెలలకో హిట్టు కొడతావ్.. ఎలా అన్నా..?

వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే నమిత తెలుగు సినిమాలకు దూరమైంది. 2010 తర్వాత తెలుగు తెరపై కనిపించకుండా పోయింది. తమిళనాడులో మాత్రం నమిత నంబర్ వన్ హీరోగా ఎదిగిపోయింది. తమిళనాట నమితకు గుడి కట్టేంతలా అభిమానులున్నారు. అక్కడ గుడి కూడా కట్టేశారు. ఖుష్బూ తర్వాత అంతటి పాపులారిటీ సంపాదించుకున్న నటి నమితనే అని చెప్పడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. తమిళనాడులో చిన్నహీరోల నుంచి పెద్ద హీరోల వరకు అందరితో కలిసి నటించి గొప్ప పేరును సంపాదించుకుంది. నమిత 2017లో వీరేంద్రను పెళ్లాడగా.. వీరికి ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+