బ్లడ్ రోజస్ మూవీ రివ్యూ : ఉత్కంఠభరితమైన ఇన్వెస్టిగేషన్.. అదిరిపోయే ట్విస్టులు
టీబీఆర్ సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై హరీష్ కమర్తి నిర్మించిన చిత్రం 'బ్లడ్ రోజస్'. అప్సర రాణి, ధర్మ కీర్తి రాజు ప్రధాన పాత్రల్లో ఎం.జి.ఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూద్దాం.
కథాంశం:
హైదరాబాద్ నగరంలో దేవి దాస్, భజరంగి దాస్ అనే ఇద్దరు రాజకీయ దిగ్గజాల మధ్య ఆధిపత్య పోరు సాగుతుంటుంది. తమ కొడుకులను వారసులుగా నిలబెట్టాలని వారు ప్లాన్ చేస్తున్న తరుణంలో, నగరంలో వరుస హత్యలు కలకలం రేపుతాయి. ఈ హత్యల్లో దేవి దాస్ కొడుకు మదన్ హస్తం ఉందనే వార్తలతో రాజకీయ ప్రకంపనలు మొదలవుతాయి. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న సి.ఐ. అరుణ్ గోగోయ్ (ధర్మ కీర్తి రాజు) రాజకీయ ఒత్తిళ్ల వల్ల సస్పెండ్ అవుతాడు. కేసు సిబిఐకి వెళ్లే తరుణంలో, హోమ్ మినిస్టర్ రంగంలోకి దిగి 'అధిర' (అప్సర రాణి) అనే పవర్‌ఫుల్ ఆఫీసర్‌ను నియమిస్తారు. అసలు ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు? అధిర ఈ మిస్టరీని ఎలా ఛేదించింది? అనేదే మిగిలిన కథ.

నటీనటుల ప్రతిభ:
ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అప్సర రాణి. 'అధిర' పాత్రలో ఆమె లుక్, పర్ఫార్మెన్స్ అద్భుతం. ఆమె కెరీర్‌లో 'బ్లడ్ రోజస్' ముందు.. ఆ తర్వాత అని చెప్పుకునేంత మైలురాయిగా ఈ పాత్ర నిలుస్తుంది.శాండల్‌వుడ్ హీరో ధర్మ కీర్తి రాజు అరుణ్ గోగోయ్‌గా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. గతంలో ఆయన చేసిన సినిమాల కంటే ఇందులో ఆయన నటన చాలా మెరుగ్గా ఉంది. ఎప్పుడూ నెగటివ్ రోల్స్ చేసే క్రాంతి, ఇందులో మార్టిన్ అనే పాజిటివ్ పాత్రలో పోలీస్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి ప్రయాణించి మెప్పించారు. సుమన్, టార్జన్, ఘర్షణ శ్రీనివాస్ తదితరులు తమ పరిధి మేరకు నటించారు.
దర్శకత్వం & విశ్లేషణ
దర్శకుడు ఎం.జి.ఆర్ అటు కన్నడ, ఇటు తెలుగు ఇండస్ట్రీ అనుభవంతో ఈ కథను చక్కగా మలిచారు. ఒక క్రైమ్ థ్రిల్లర్‌కు సామాజిక సందేశాన్ని జోడించడం విశేషం. "మహిళలను తక్కువ చేయొద్దు.. ప్రేమ పేరుతో వారిని మోసం చేయకూడదు" అనే పాయింట్‌ను నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా ఆవిష్కరించారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే ట్విస్టులు, ఇన్వెస్టిగేషన్ సీన్లు ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడతాయి. 2026లో వచ్చిన విభిన్నమైన కథా చిత్రాల జాబితాలో 'బ్లడ్ రోజస్' ఖచ్చితంగా నిలుస్తుంది.
ప్లస్ పాయింట్స్:
అప్సర రాణి, ధర్మ కీర్తి రాజుల నటన.
ఆకట్టుకునే స్క్రీన్ ప్లే ,సస్పెన్స్ అంశాలు.
సమాజానికి అవసరమైన సందేశం.
మైనస్ పాయింట్స్:
కథ కాస్తా స్లోగా సాగుతుంది.
ఫైనల్‌గా : యాక్షన్, సస్పెన్స్ , మంచి మెసేజ్ ఉన్న సినిమాలను ఇష్టపడే వారు 'బ్లడ్ రోజస్'ను ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు. ఉత్కంఠభరితమైన క్లైమాక్స్ కోసం ఈ వీకెండ్ ఈ సినిమాపై ఒక లుక్కేయండి.
రేటింగ్: 2.5/5
-
వీడియో వైరల్: స్నేహా రెడ్డికి ఖరీదైన బహుమతి ఇచ్చిన అల్లు అర్జున్.. -
రజనీకాంత్, ధనుష్‌లకు పొరుగున.. కోట్లు పెట్టి ఇల్లు కొన్న స్టార్ హీరోయిన్! -
నా కథను మానభంగం చేసేశారు..! -
"ఇది భగత్ గీత.. దమ్మున్నోడు దాటొచ్చు" -
ఇంటెన్స్ కోర్టు డ్రామాతో మెంటలెక్కించేశారుగా..! -
`ఉస్తాద్` విషయంలో తెలిసి చేశారో తెలియక చేశారో గానీ.. !! -
ఒకటి ఫుల్ క్లాస్.. ఇంకోటి ఊర మాస్.. ఫుల్ జోష్ లో యంగ్ హీరో !! -
"ఐరన్ లెగ్".. అప్పుడు ఆమెలానే.. ఇప్పుడు ఈమెకి కూడా ?? -
ఆ హీరోని చూస్తే సింహాన్ని చూసినట్టే - కోర్టు బ్యూటీ శ్రీదేవి -
తప్పేం చేయలేదు.. తిరుమలలో కేక్ కటింగ్ వివాదంపై దివ్వెల మాధురి షాకింగ్ స్పందన! -
ఆ సినిమా వదులుకోవడమే ప్రభాస్ కెరీర్‌కు ‘శ్రీరామరక్ష’ -
ఆ సినిమాను ఎవరూ చూడట్లేదు!: Rahul Gandhi రివ్యూ












Click it and Unblock the Notifications