2034లో జూనియర్ ఎన్టీఆరే ముఖ్యమంత్రి: అక్బర్ బిన్ జాతకం
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న దేవర చిత్రాన్ని బాలీవుడ్ లో దర్శకుడు కరణ్ జోహార్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. దీంతోపాటు హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు ముంబయి వెళ్లారు.
ముంబయిలో ఉన్న తారక్ ఓ పార్టీలో పాల్గొన్నాడు. ఆ పార్టీకి ఎమ్మెల్యే జీషన్ బాబా సిద్ధిఖీతోపాటు బాలీవుడ్ నటుడు అక్బర్ బిన్ తబర్ కూడా పాల్గొన్నారు. అక్కడే అక్బర్ సీనియర్ ఎన్టీఆర్ ను గుర్తుచేశారు. అందరినీ ఎంతో ఆప్యాయంగా ఆయన పలకరించేవారని, ఆయన గొంతు చాలా ప్రత్యేకంగా ఉంటుందన్నారు. ఆ వాయిస్ ను ఇప్పుడు మీలో చూస్తున్నానంటూ తారక్ కు చెప్పాడు. తెలుగు పరిశ్రమలో ఎంతోమంది సూపర్ స్టార్లు ఉన్నారని, వారందరికీ నువ్వు ఫాదర్ అంటూ ప్రశంసలు కురిపించాడు.

అప్పటి ఎరా మళ్ళీ రాబోతుందని, 2034 ఎన్నికల్లో మీరే ముఖ్యమంత్రి అంటూ జోస్యం చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై తారక్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి నందమూరి వారసులు కాకుండా చంద్రబాబునాయుడి చేతిలో ఉందని, తారక్ ను తెలుగుదేశం పార్టీ దూరం పెడుతోందంటూ అభిమానులు చాలా సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
దేవర సినిమా విజయదశమికి విడుదల కాబోతోంది. తర్వాత వార్ 2 విడుదలయ్యే అవకాశం ఉంది. దీనితర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు తారక్. కరణ్ జోహార్, కల్యాణ్ రామ్ నిర్మాతలుగా బాలీవుడ్ లో మరో సినిమా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications