మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు..
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్‌ను ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో నటుడు సాహిల్ ఖాన్‌కు సిట్ అధికారులు డిసెంబరులోనే సమన్లు జారీ చేశారు. కానీ, ఆయన విచారణకు హాజరుకాలేదు. దీంతో ముంబయి పోలీసులు తాజాగా నటుడిని అదుపులోకి తీసుకున్నారు. 40 గంటల పాటు చేధించిన తర్వాత ముంబై పోలీసులు సాహిల్ ఖాన్‌ను ఛత్తీస్‌గఢ్‌లో పట్టుకున్నారు. మధ్యంతర బెయిల్‌కు ముంబై కోర్ట్ నిరాకరించడంతో సాహిల్ పరారయ్యినట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. ఈ కేసు విచారణలో భాగంగా ఆదివారం అతడిని ముంబైకి తరలించి, కోర్టు ముందు హాజరుపరుస్తామని పోలీసులు చెప్పారు.
మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసులో పలువరు బాలీవుడ్ స్టార్‌లతో పాటు నటుడు సాహిల్ ఖాన్ పేరు కూడా బయటపడింది. సాహిల్ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 'స్టైల్', 'ఎక్స్‌క్యూజ్‌మీ' సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం సాహిల్ ఫిట్‌నెస్ ట్రైనర్‌గా కొనసాగుతున్నారు. సొంతంగా ఓ కంపెనీని స్థాపించి ఫిట్‌నెస్ సప్లిమెంట్స్‌ను విక్రయిస్తున్నారు. ఏప్రిల్ 13న ముంబై పోలీసుల ఎదుట సాహిల్ ఖాన్ హాజరయ్యాడు. ఈ నేపథ్యంలో కేసు విచారణలో పాల్గొనేందుకు సాహిల్ ముంబై పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. మాతుంగా పోలీస్‌లో కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు కోసం ముంబయి క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేయడం జరిగింది.

మరో ముగ్గురికి సమన్లు...
ఈ కేసులో భాగంగా గతేడాది డిసెంబర్‌లో ముంబై సైబర్ సెల్‌లోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సాహిల్‌తో పాటు మరో ముగ్గురికి సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్‌లో సిట్ ముందు హాజరుకావాలని ఆదేశించింది. కానీ, ఆయన విచారణకు హాజరుకాకపోగా, ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. యాప్ ద్వారా జరిగే కార్యకలాపాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని సాహిల్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ముంబై హైకోర్టు మాత్రం సాహిల్ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన విషయం తెలిసిందే. ముంబయి పోలీసులు ఆదివారం సాహిల్ ఖాన్‌ను కస్టడీలోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications