ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన బాలీవుడ్ నటి..
బాలీవుడ్ నటి జాన్వీకపూర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఫుడ్ పాయిజన్ కారణంగా జులై 18వ తేదిన ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ ప్రముఖ నటి జాన్వీకపూర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నారు. ఇక, ఈ విషయాన్ని స్వయంగా జాన్వీకపూర్ తండ్రి బోనీ కపూర్ తెలిపారు. ప్రస్తుతం జాన్వీకపూర్ సోదరి ఖుషీకపూర్, సన్నిహితుడు షిఖార్ పహారియా పర్యవేక్షణలో ఉన్నారు.
24 గంటల పాటు చికిత్స పొందిన అనంతరం జాన్వీ కపూర్ పూర్తి ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నారు. జాన్వీ కాస్త నీరసంగా ఉన్నప్పటికీ మరొక రోజులో ఆమె పూర్తిగా కోలుకోనున్నట్లు సమాచారం. చెన్నై నుంచి ముంబైకి వస్తున్న నేపథ్యంలోనే జాన్వీ కపూర్ తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. తన ఆరోగ్యం రిత్యా బయటకు వెళ్లకూడదని నిర్ణయించుకున్న, తప్పనిసరి పరిస్థితుల్లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల పెళ్లికి వెళ్లాల్సి వచ్చింది.

అప్పటికే జాన్వీ ఆరోగ్యం బాగా లేకపోవడం, ఆపై వివాహానికి హాజరుకావడంతో ఆమె మరింత అనారోగ్యానికి గురికావాల్సి వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను ఈ నెల 18న ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ జాన్వీని పరిశీలించిన వైద్యులు ఆమె ఫుడ్ పాయిజన్‌కు గురయినట్లు తెలిపారు. ఇప్పుడు ఆమె కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకోవడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
అనంత్ అంబానీ-రాధిక వివాహానికి బాయ్‌ఫ్రెండ్ షిఖార్‌తో కలిసి జాన్వీ కపూర్ హాజరయ్యారు. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను కూడా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇక, జాన్వీ సినిమాల విషయానికోస్తే.. తెలుగులో ఈ అమ్మడు ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తోన్న దేవర చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు తెలుగులో మరో సినిమాకు కూడా జాన్వీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అందులో జాన్వీ రామ్ చరణ్‌తో కలిసి చిందులేయనుంది.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications