బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఇంట తీవ్ర విషాదం..
బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. గత కొద్దిరోజులుగా ఆమె తల్లి కిమ్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఈరోజున జాక్వెలిన్ తల్లి గుండెపోటుతో మరణించినట్లుగా తెలుస్తోంది. దీంతో జాక్వెలిన్ అభిమానులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.
గత నెల 24వ తేదీన జాక్వెలిన్ తల్లి గుండెపోటుతో లీలావతి ఆసుపత్రిలో చేరారు. అప్పటినుంచి తన తల్లిని దగ్గరుండి మరీ జాక్వెలిన్ చూసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఆమె తల్లి మరణంతో జాక్వెలిన్ చాలా కృంగిపోయిందని సన్నిహితులు చెబుతున్నారు. అంత్యక్రియలు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరగనున్నట్టు వెల్లడించారు.

మరోవైపు గత నెల 26న గౌహతిలో జరిగే ఐపీఎల్ వేడుకలలో కూడా జాక్వెలిన్ పర్ఫార్మ్ చేస్తారని అంతా భావించారు. కానీ ఐసీయూలో చికిత్స తీసుకుంటున్న తల్లిని చూసుకోవడం కోసం ఐపీఎల్ ఆఫర్ ను సైతం జాక్వెలిన్ వదులుకున్నారని అంటున్నారు. అంతా ముందు 2022లో కూడా జాక్వెలిన్ తల్లి గుండెపోటుతో ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. కానీ ఈసారి మాత్రం పరిస్థితి విషమించడంతో తదిశ్వాస విడిచారు.
శ్రీలంకకు చెందిన జాక్వెలిన్ ఫెర్నాండేజ్ 2006లో మిస్ యూనివర్స్ శ్రీలంకగా ఎంపికైంది. శ్రీలంక తరఫున 2006లో మిస్ యూనివర్స్ పోటీకి కూడా ప్రాతినిధ్యం వహించారు. అంతే కాకుండా శ్రీలంకలో టీవీ రిపోర్టర్ గా కూడా పనిచేసిన ఆమె.. 2009లో అలాడిన్ మూవీ ద్వారా నటిగా కెరీర్ ప్రారంభించారు. ఇక బాలీవుడ్ లో కూడా పలు చిత్రాల్లో నటించిన ఆమె.. 2011లో రిలీజ్ అయిన మర్డర్ 2 సినిమాతో మంచి విజయం దక్కించుకున్నారు. అలానే తెలుగులో ప్రభాస్ నటించిన సాహో సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 'హరిహర వీరమల్లు' సినిమాలో స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్టు టాక్ నడుస్తోంది.
రీసెంట్ గానే మనీ లాండరింగ్ కేసులో కూడా ఇరుక్కున్న ఈమె విచారణకు కూడా హాజరయ్యారు. రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడైన సుఖేష్ చంద్రశేఖర్ ఈడీ విచారణ ఎదుర్కొంటూ తీహార్ జైల్లో ఉన్నారు. ఈ కేసులో ఏడు కోట్లకు పైగా ఆస్తులను ఆమె సుఖేశ్ నుంచి జాక్వెలిన్ తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు.
-
ఆశా భోస్లే చివరి వీడియో వైరల్.. కదిలిస్తున్న దృశ్యాలు! -
ఆశాభోస్లే - లతా మంగేష్కర్.. అక్క చెల్లెల మధ్య అసలు గొడవేంటి ??? -
ఆశా భోంస్లే 'స్వర' సామ్రాజ్యం.. ఆస్తుల గురించి షాకింగ్ నిజాలు! -
శోకసంద్రంలో చిత్రసీమ, లెజెండరీ సింగర్ కన్నుమూత! -
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
అడ్డంగా దొరికిన చంద్రబాబు? అంకెలతో తేల్చేసిన సజ్జల ..! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..!










Click it and Unblock the Notifications