బుల్లితెర షో పై సంద‌డి చేయ‌నున్న‌.. బాలీవుడ్ న‌టి స‌న్నీ లియోన్..

బుల్లితెర షో పై సంద‌డి చేయ‌నున్న‌.. బాలీవుడ్ న‌టి స‌న్నీ లియోన్ : స‌న్నీలియోన్‌.. ఈ పేరు తెలియ‌ని వారుండ‌రు...ఎందుకంటే, యువ‌త‌లో ఈమెకు ఎంత క్రేజ్ ఎందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అయితే, ఇప్ప‌డు ఆమె త్వ‌ర‌లోనే ఒక బుల్లితెర షో పై సంద‌డి చేయ‌నున్నారు. ఒక‌ప్పుడు ఫోర్న్‌స్టార్‌గా సినిమాలు ప్రారంభించిన స‌న్నీలియోన్ వ‌రుస‌గా అవ‌కాశాలు చేజిక్కించుకుని త‌న మీదున్న ఫోర్న్‌స్టార్ ముద్ర‌ను తొల‌గించుకుంది. స‌న్నీ లియోన్ కేవ‌లం బాలీవుడ్‌కే ప్రాధాన్యం ఇవ్వ‌కుండా.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, మాలీవుడ్‌ల‌లోనూ న‌టిస్తూ బాగానే వెన‌కేసుకుంటోంది ఈ సెక్సీ భామ‌. ప్ర‌స్తుతం సినీ ప్ర‌ప‌పంచంలో స‌న్నీలియోన్‌కు ఉన్న డిమాండ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఒక్క స‌న్నీ లియోన్ ఐటెం సాంగ్‌తో సినిమాను విజ‌య తీరాల‌కు చేర్చేయ‌వ‌చ్చ‌నే అభిప్రాయానికి వ‌చ్చేశారు సినీ నిర్మాత‌లు.

తన గత జీవితాన్ని పక్కన పెట్టి సన్నీలియోన్ ఇప్పుడు నటిగా రాణిస్తోంది. బాలీవుడ్ లో సన్నీలియోన్ హైవోల్టేజ్ రొమాంటిక్ మూవీస్ లో నటిస్తూ యువతని అలరిస్తోంది. ప్రస్తుతం ఆమెకి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఒక ప‌క్క హీరోయిన్‌గా ...మ‌రో ప‌క్కా ఐటెం సాగ్స్‌తో కుర్ర‌కారుకి నిద్ర‌లేకుండ చేస్తోంది ఈ భామ‌. తెలుగులో కూడా సన్నీలియోన్ కరెంట్ తీగ అనే చిత్రంలో నటించింది. గరుడ వేగ మూవీలో ఒక ఐటెం సాంగ్‌లో కూడా చేసింది. ప్రస్తుతం సన్నీలియోన్ పలు చిత్రాల్లో నటిస్తోంది. ఒక‌ప‌క్క చిత్రాల్లో న‌టిస్తూనే బాలీవుడ్‌లో కొన్ని టివీషోలు కూడా చేసింది. అయితే, ఇప్పుడు ఆమెను తెలుగు బుల్లితెర‌పై దించేందుకు కూడా ప్ర‌య‌త్నం జ‌రుగుతుంది. బోల్డ్ బ్యూటీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా బుల్లి తెరపై కూడా ఆమె ప్రజెంట్ చేయాల‌నే ఆలోచ‌న‌లో తెలుగు టివీషోలు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

Bollywood actress Sunny Leone will make noise on the TV show..

తొలిసారిగా సన్నీలియాన్ బుల్లితెరపై మెరిసేందుకు రంగం సిద్ధ‌మ‌య్యింది. హిందీలోనో ఏ ఇతర భాషలోనో కాదు ఏకంగా తెలుగు బుల్లితెర షోతో సన్నీలియోన్ యాంకర్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. జీ నెట్‌వ‌ర్క్‌ సంస్థ జీ తెలుగులో ' తెలుగు మీడియం ఇ స్కూల్' అనే ఫన్ షోని ప్రారంభించబోతోంది. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమోను ఇటివ‌ల‌ రిలీజ్ చేశారు. సన్నీలియోన్ పంతులమ్మ గెట‌ప్‌లో అందంగా చీర కట్టుకుని, కళ్ళజోడు పెట్టుకుని హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆమెకి కో హోస్ట్ గా యాంకర్ రవి వ్యవహరించనున్నాడు. ఫుల్ మ‌స్తీతో సాగే ఈ షోలో బుల్లితెర కమెడియన్లు సెలెబ్రిటీలు సందడి చేయబోతున్న‌ట్లు ఈ ప్రోమోలో ఉంది.

సన్నీలియోన్ ముద్దు ముద్దుగా తెలుగులో మాట్లాడుతూ అందరిని అలరిస్తోంది. 'తెలుగు నాకు జీవితాన్ని ఇచ్చింది. అందరికి నమస్కారం.. తెలుగుని ఎంటర్టైన్మెంట్ తో సెలెబ్రేట్ చేసుకుందాం.. ఇది నెవర్ బిఫోర్ రియాలిటీ షో అంటూ సన్నీలియోన్ ప్రోమోలో చెబుతున్న డైలాగ్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తెలుగు సరిగ్గా రాణి సన్నీ లియోన్ తెలుగు షోకి యాంకర్ గా చేయడం ఏంటి? అని చాలామంది నెటిజ‌న్లు అనుకుంటున్నారు. ఇదంతా ఆమె క్రేజ్ అని అనుకున్న వారుకూడా ఉన్నారు. అయితే, ఏది ఏమైనా బిగ్ స్ర్కీన్ లో చూసినా బాలీవుడ్ న‌టిని ఇప్పుడు బుల్లితెర‌లో అది మ‌న తెలుగు ఛానెల్‌లో చూడబోతున్నాం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+