ఎనిమిదేళ్ల వైవాహిక బంధానికి గుడ్‌బై చెప్పనున్న బాలీవుడ్ సీనియర్ నటి..
ఏ చిత్ర పరిశ్రమ చూసుకున్న ఇటీవల విడాకుల వార్తలు తరుచుగా వింటూనే ఉన్నాం. అయితే, తాజాగా మరో బాలీవుడ్ సీనియర్ నటి.. తన ఎనిమిదేళ్ల వైవాహిక బంధానికి విడాకులతో ముగింపు పలికేందుకు సిద్ధమయ్యారు. ఆమె మరేవరో కాదు. భారతీయుడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన అలనాటి అందాల తార ఊర్మిళ మతోంద్కర్.
బాలీవుడ్ సీనియర్ నటి ఊర్మిల కూడా తన భర్తతో విడాకులు తీసుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వీరిద్దరి విడాకుల గురించి బీ టౌన్ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరగుతోంది. తన భర్త మోసిన్ అక్తర్ మీర్‌తో ఉన్న వైవాహిక బంధానికి ముగింపు చెప్పాలని నటి ఊర్మిళ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఆమె ముంబై కోర్టులో కూడా డివోర్స్ కోసం అప్లయ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, విడాకుల విషయంపై హీరోయిన్ ఊర్మిళ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ, ఊర్మిళ మాత్రం నాలుగు మాసాల క్రితమే కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసినట్లు నేషనల్ మీడియా ప్రకటించేసింది.

యాభై ఏళ్ల వయసులో విడాకులు..
సీనియర్ నటి ఊర్మిళ చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు. ఆమె ఒక్క హిందీలోనే కాకుండా తెలుగులోనూ పలు సినిమాల్లో నటించారు. సినీ రంగంలో తన అందం, అభినయంతో అలరించిన నటి ఊర్మిళ రాజకీయాల్లో కూడా చేరారు. 2019లో కాంగ్రెస్ పార్టీలో చేరి ముంబాయి నార్త్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేశారు. అయితే, ఆ సమయంలో ఆమె ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. ఆ తర్వాత 2020లో శివసేన పార్టీలో చేరారు.
2016లో నటి ఊర్మిళ కాశ్మీర్‌కు చెందిన బిజినెస్‌మెన్ మోసిన్ అక్తర్ మీర్‌ను పెళ్లిచేసుకున్నారు. భర్త మోసిన్ కన్న ఊర్మిళ పది సంవత్సరాలు పెద్దది. ప్రస్తుతం నటి ఊర్మిళ వయసు 50 ఏళ్లు.. ఈ వయసులో అది కూడా, పెళ్లయిన ఏనిమిదేళ్ల తర్వాత వీరిద్దరూ వేరుగా ఉండడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఊర్మిళ విడాకులు తీసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే విడాకులు తీసుకోవడం తన భర్తకు ఇష్టంలేదని సమాచారం. కేవలం నటి ఊర్మిళ మాత్రమే విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారని బీ టౌన్ మీడియా కోడై కూస్తోంది.












Click it and Unblock the Notifications