ప్రేమలో ఉంటే ఫస్ట్ బెడ్‌రూమ్‌ను పంచుకోండి ..నటి సంచలన కామెంట్స్
సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే.
మెచురిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంనే మాట్లాడుతుంటారు. తాజాగా ఓ బాలీవుడ్ నటి లివింగ్ అండ్ రిలేషన్‌షిప్ గురించి తనదైనశైలిలో స్పందించారు. జీనత్ అమస్... ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకవచ్చు కానీ.. బాలీవుడ్ జనాలకు ఈ నటి సుపరిచితురాలే. ముఖ్యంగా దమ్ మారో దమ్ పాటలో తన స్టెప్పులతో కుర్రకారును కట్టిపడేసింది. బాలీవుడ్‌లో వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది.

ఆ తరువాత బాలీవుడ్ దర్శకుడు మజర్ ఖాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో తరువాత విభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. విడాకుల తరువాత సింగిల్‌గానే జీవితాన్నికొనసాగిస్తున్న జీనత్ అమస్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు.తన జీవితంలో ఎదురైన అనుభవాల గురించి యూత్‌కు టిప్స్ ఇస్తుంటుంది. ఇదే సమయంలో కుర్రాళ్లకు ప్రేమ పాఠాలు చెబుతూ తన శేషజీవితాన్ని గడుపుతుంది.
జీనత్ అమస్ తాజాగా తన సోషల్ మీడియాలో ఓ ఆసక్తకరమైన పోస్ట్‌ను షేర్ చేశారు. ప్రేమ, పెళ్లి , విడాకులు గురించి తనదైనశైలిలో స్పందించారమె. మీరు ప్రేమలో ఉంటే వెంటనే పెళ్లి చేసుకోద్దని.. కొన్ని రోజులు మీ పార్టనర్‌తో గడిపిన తరువాత మీ భాగస్వామి మీకు సూటు అవుతారో లేదో చూసి అప్పుడు వివాహం చేసుకోండని ఆమె సలహాలిస్తోంది. ప్రేమలో ఉన్న సమయంలో అన్నీ బాగానే ఉంటాయని.. ఇద్దరు కలిసి ఓ గదిలో జీవిస్తేనే ఒకరి గురించి మరొకరికి తెలుస్తోందని ఈ బాలీవుడ్ నటి చెప్పుకొచ్చింది. ముఖ్యంగా బెడ్‌రూమ్ విషయాలను షేర్ చేసుకోవాలని కీలక సూచనలు చేస్తోంది. అలా ఉండగలిగితేనే పెళ్లి చేసుకోవాలని లేకపోతే విడిపోవడమే మేలంటూ యూత్‌కు సలహాలు ఇస్తోంది.












Click it and Unblock the Notifications