బట్టలపై రచ్చ.. రాఖీ రోజున ఒక్క క్యాప్షన్‌తో అందరికీ పంచ్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ తన సోదరి నుపుర్ సనన్‌తో కలిసి జరుపుకున్న రాఖీ పండుగ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే ఈ పోస్ట్ ద్వారా కృతి సనన్ ఇటీవల విడుదలైన రక్షాబంధన్ యాడ్‌పై వచ్చిన తీవ్ర విమర్శలకు ధీటుగా బదులిచ్చారు. 'రాఖీ ఫ్యాషన్ కమిటీ ఇంకా చర్చలు జరుపుతూనే ఉండుగాక" అంటూ కృతి పెట్టిన క్యాప్షన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రంగా వైరలవుతోంది.
ఇటీవల కృతి సనన్ నటించిన రాఖీ పండుగ యాడ్‌లో ఆమె ధరించిన దుస్తులపై తీవ్ర వివాదం చెలరేగింది. ఆ యాడ్ లో ఆమె 'బ్రా లెట్' తరహా బ్లౌజ్, కేప్, డ్రేప్డ్ స్కర్ట్ ధరించి రాఖీ కట్టడంపై కొందరు నెటిజన్లతో పాటు నటి, ఎంపీ కంగనా రనౌత్ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సంప్రదాయ పండుగ ప్రకటనలో ఇలాంటి దుస్తులు ధరించడంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరిగింది.

ఈ విమర్శలపై కృతి సనన్ స్పందిస్తూ.. పండుగలు, సంస్కృతులు మనం వేసుకునే దుస్తుల్లో ఉండవని.. మనం భావించే పవిత్రమైన ఆలోచనలు, సంప్రదాయాల పట్ల ఉన్న గౌరవంలో ఉంటాయని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే తన సోదరి నుపుర్ సనన్ కు రాఖీ కట్టిన ఫోటోను షేర్ చేస్తూ.. అసలైన పండుగ భావనపై దృష్టి పెట్టాలని చెబుతూ 'ఫ్యాషన్ కమిటీ'పై పరోక్షంగా సెటైర్లు వేశారు.
Everyone trolling Kriti Sanon for this GIVA ad, saying she’s wearing a “bikini.” Is she? Nope.
— Ritzz (@ChaoticRitzz) August 23, 2026
She’s not dressed inappropriately.
Maybe her outfit just doesn’t fit your definition of “decency.” I could wear that in front of my brother too.
Same people cheering her bikini… pic.twitter.com/65aSejJLFU
దుస్తుల వివాదంతో పాటు ఆ యాడ్‌లోని మరో సీన్‌పై కూడా నెటిజన్లు మండిపడ్డారు. అందులో కృతి సనన్ ఓ పెంపుడు కుక్కకు రాఖీ కడుతున్నట్లు చూపించగా.. అది పండుగ పవిత్రతను అవమానించడమేనంటూ కొందరు విమర్శించారు. ఏది ఏమైనప్పటికీ.. సోషల్ మీడియా కామెంట్లను పక్కన పెట్టి సోదరీమణులిద్దరూ ఎంతో ఆనందంగా రక్షాబంధన్ వేడుకులను జరుపుకోవడం నెటిజన్ల దృష్టిని ఆకట్టుకుంటోంది.













Click it and Unblock the Notifications