'గేమ్ ఛేంజర్' ఫ్లాప్ అని రెండు నెలల క్రితమే చెప్పా

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన చిత్రం 'గేమ్ ఛేంజర్'. సంక్రాంతి కానుకగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. సరైన కథతో సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు శంకర్ ఘోరంగా ఫెయిల్ అయ్యారనే మాటలు వినిపిస్తున్నాయి. కథ, కథనం రెండు కూడా బాలేకపోవడంతో ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. మెగా అభిమానులు సైతం సినిమా బాలేదని తేల్చేశారు. అయితే బాలీవుడ్ ప్రముఖ క్రిటిక్ ఉమర్ సంధు 'గేమ్ ఛేంజర్' సినిమాపై షాకింగ్ ట్వీట్ చేశారు.

తాను 'గేమ్ ఛేంజర్' సినిమా ప్లాప్ అని రెండు నెలల క్రితమే చెప్పానని ఉమర్ సంధు తన ట్వీట్‌లో చెప్పుకొచ్చాడు. రెండు నెలల క్రితం ఉమర్ సంధు తన ట్వీట్‌లో.. శంకర్ , రామ్ చరణ్‌ కెరీర్‌లోనే అత్యంత బలహీనమైన సినిమాగా 'గేమ్ ఛేంజర్' ఉందని ఉమర్ సంధు చెప్పుకొచ్చాడు.బోరింగ్ నరేషన్, కాలం చెల్లిన కథ, స్క్రీన్ ప్లే & డైలాగ్స్ అన్ని కూడా పేలవంగానే ఉన్నాయని ఈ బాలీవుడ్ క్రిటిక్ తెలిపాడు. నటీనటుల ప్రదర్శన కూడా అంతగా లేదని తెలిపారు. ఈ విషయంలో రామ్ చరణ్ నన్ను క్షమించాలని అతను కోరాడు. ఫైనల్‌గా సినిమా టార్చర్ అని తేల్చేశాడు. రెండు నెలల క్రితమే తాను చేసిన ట్వీట్‌ను ఉమర్ సంధు రీట్వీట్ చేశాడు.

Bollywood critic Umair Sandhu about Game Changer relult

ఉమర్ సంధు చెప్పినట్టుగానే సినిమా ఏమాత్రం బాలేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉమర్ సంధు చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక గేమ్ ఛేంజర్ విషయానికి వస్తే..వరల్డ్​వైడ్​గా ఈ సినిమా సుమారు రూ.186 కోట్లు వసుళ్లు సాధించినట్లు నిర్మాణ సంస్థ ఓ స్పెషల్ పోస్టర్​ ద్వారా తెలిపింది. మరోవైపు ప్రముఖ టికెట్‌ బుకింగ్‌ ప్లాట్‌ఫామ్‌ బుక్‌ మై షోలో 'గేమ్‌ ఛేంజర్‌'కు తొలి రోజు 1.3 మిలియన్లకు పైగా టికెట్స్‌ అమ్ముడైనట్లు ఆ సంస్థ వెల్లడించింది. రామ్ చరణ్ కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్ సాధించిన సినిమాగా 'గేమ్‌ ఛేంజర్‌' నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+