ధూమ్ 4లో బాలీవుడ్ బాద్‌షాతో గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్..
Bollywood : ధూమ్ 4లో బాలీవుడ్ బాద్‌షాతో గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ : గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ బాలీవుడ్ బాద్‌షాతో ధూమ్ 4లో నటించనున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్‌చరణ్ ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం రామ్‌చరణ్ గేమ్‌ఛేంజర్ సినిమాతో బిజిగా ఉన్నారు. ఈ సినిమాకు దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, తాజాగా రామ్‌చరణ్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే రామ్‌చరణ్ బాలీవుడ్ సినిమాలో నటించబోతున్నారు. బాలీవుడ్‌లో ఇంతకుముందే ఓ సినిమా తీసి ఘోర పరాజయాన్ని చూశారు రామ్‌చరణ్. ఇప్పడు మరోసారి బాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.
అది కూడా బాలీవుడ్ బాద్‌షా తో కలిసి నటించబోతున్నారట. ధూమ్ 4లో షారూక్‌తో రామ్‌చరణ్ నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. 2013లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నధూమ్ 3 సినిమాకి సీక్వెల్ గా 'ధూమ్ 4' తెరకెక్కించాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయని తెలుస్తోంది. 'ధూమ్' ఫ్రాంఛైజీలో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలన్నీ కూడా మంచి విజయాలను చేకూర్చాయి. ఇక, ధూమ్ 4 పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ధూమ్ 4లో అభిషేక్ బచ్చన్ స్థానంలో రామ్‌చరణ్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై మూవీమేకర్స్ రామ్‌చరణ్‌ను సంప్రదించినట్లు సమాచారం. అయితే, ఈ సినిమా గురించి మూవీ మేకర్స్ మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఏదిఏమైనా ఒకే తెరపై అటు బాలీవుడ్ బాద్‌షా, ఇటు గ్లోబల్ స్టార్‌ను చూడడం అభిమానులకే పండగే అని చెప్పుకోవాలి.

గేమ్ ఛేంజర్ సినిమాతో బిజిగా ఉన్నరామ్‌చరణ్ : ప్రస్తుతం రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్‌లో బిజిగా ఉన్నారు. ఈ సినిమా ఒక పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కబోతుందని టాక్. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. సుమారు 300 రూపాయల కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తున్నారని సమాచారం. ఈ సినిమాను సెప్టెంబర్ 2024లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా అనంతరం రామ్‌చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారని టాక్. దర్శకుడు బుచ్చిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఉప్పెన వంటి సూపర్ హిట్ సినిమాను అందించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications