ఆ స్టార్ హీరో ఇల్లు... దేశంలో ఎక్కడా లేదు!
స్టార్ హీరోల పారితోషికం ఈరోజుల్లో చుక్కల్లో ఉంటోంది. అందుకు సిద్ధపడే నిర్మాతలతోనే వారు సినిమాలు చేస్తున్నారు. తమ పారితోషికంతో అత్యంత విలాసవంతమైన ఇళ్లను నిర్మించుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటివారు ముంబయిలోని అత్యంత ఖరీదైన ఇళ్లల్లో నివసిస్తుంటారనే సంగతి తెలిసిందే. అయితే వీరందరికన్నా అత్యంత లగ్జరీ ఇంట్లో నివసించే హీరో మాత్రం సైఫ్ అలీఖాన్. ఆయన ఇంటి విలువ రూ.800 కోట్లుగా ఉంది.
ఢిల్లీకి 80 కిలోమీటర్ల దూరంలో
నవాబుల కుటుంబానికి చెందిన సైఫ్ అలీఖాన్ ఇల్లు హర్యానాలో ఉంటుంది. ఢిల్లీకి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇంత లగ్జరీ ఇల్లు దేశంలో మరే హీరోదగ్గరా లేదు. సైఫ్ తాత నవాబు ఇఫ్తికార్ అలీఖాన్ పటౌడ్ ఈ ఇంటిని నిర్మించారు. ఆయనకు బేగం ఆఫ్ భోపాల్ తో వివాహమైన తర్వాత తాము ఉంటున్న ఇల్లు తమ రాచరికానికి తగినట్లుగా లేదని భావించి ఈ ప్యాలెస్ ను నిర్మించారు. ప్రస్తుతం ఈ ఇల్లు సైఫ్ పేరుతోనే ఉంది. వేసవికాలంలో సైఫ్ తోపాటు ఆయన చెల్లెలు సోహా అలీఖాన్ కుటుంబ సభ్యులంతా వచ్చి సేద తీరుతారు.

ఎన్నో కష్టాలు
అయితే ఇంత గొప్ప ప్యాలెస్ ను కట్టినప్పటికీ తమకు వారసత్వంగా రాలేదని, దానికోసం ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చిందని షర్మిల ఠాగూర్ తెలిపారు. అలీఖాన్ పటౌడీ తర్వాత కాలక్రమంలో ఈ ఇంటిపై అప్పులు పెరిగిపోయాయి. సైఫ్ తండ్రి మన్సూర్ పటౌడి 2011లో మరణించారు. ఆయన మృతిచెందిన తర్వాత దీన్ని దక్కించుకునేందుకు, అప్పులు తీర్చేందుకు ఎంతో కష్టపడాల్సి వచ్చిందని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కొంతకాలం నుంచి దీన్ని సినిమా షూటింగ్ లకు అద్దెకు ఇస్తున్నారు. గత సంవత్సరం విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసిన యానిమల్ సినిమా కూడా ఇందులోనే తీశారు. షారుక్ ఖాన్ నటించిన వీర్ రాజాతోపాటు అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ తాండవ్ లాంటివి కూడా ఈ ప్యాలెస్ లో షూటింగ్ జరుపుకున్నాయి.












Click it and Unblock the Notifications