షారుక్ ఖాన్ ఆస్తుల విలువ
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ జవాన్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. పఠాన్ సినిమాతో ఒక దుమ్ము దులిపిన బాద్ షా జవాన్ తో విజృంభించబోతున్నాడని అభిమానులు గర్వంగా చెబుతున్నారు. ఈ సినిమా కూడా మరో వెయ్యికోట్ల రూపాయలను వసూలు చేస్తుందంటున్నారు. దేశవ్యాప్తంగా అన్ని సినీ పరిశ్రమల్లో అందరు హీరోలు, హీరోయిన్లు ఇష్టపడే ఏకైక వ్యక్తి షారుక్ ఖాన్. తెర బయట కూడా తన ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకుంటారు.
అరవై సంవత్సరాల వయసు దగ్గరపడుతున్నప్పటికీ ఇప్పటికీ స్టార్ హీరోగా రాణిస్తున్నారు. ప్రపంచం మొత్తం ఆయనకు అభిమానులున్నారు. అటువంటి బాద్ షా నాలుగు సంవత్సరాల నుంచి సినిమాలకు దూరంగా ఉండి పఠాన్ తో మరోసారి రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాతో ఆయన తన సత్తాను చాటారు. ఇదే సంవత్సరంలో మరో సినిమా జవాన్ ను విడుదల చేశారు. ఈ సినిమా మొదటిరోజు కలెక్షన్లలో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా షారుక్ ఖాన్ ఆస్తులు ఎంతమేరకు ఉంటాయనే చర్చ నడుస్తోంది. ఈ ఒక్క సంవత్సరమే బాద్ షా ఆదాయం రూ.290 కోట్లుగా ఉంది. ఆయనకు రూ.200 కోట్ల విలువ చేసే పెద్ద లగ్జరీ విల్లాతోపాటు లగ్జరీ కార్లు ఉన్నాయి. కేవలం సినిమాల నుంచే ఆదాయం కాకుండా వివిధ బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ, వాణిజ్య ప్రకటనలద్వారా కూడా పెద్దమొత్తంలో సంపాదిస్తున్నారు.
ఆస్తిపాస్తులన్నీ కలిపి లెక్కిస్తే రూ.6,350 కోట్లకు పైగా ఉంటుంది. ఇన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నప్పటికీ ఈ వయసులో కూడా యంగ్ హీరోలతో సమానంగా కష్టపడటంతోపాటు పర్సనాలిటీని కూడా మెయింట్ నెన్స్ చేస్తున్నారు. తన సినిమాలద్వారానే కాకుండా వ్యక్తిగత ప్రవర్తన ద్వారా కూడా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.












Click it and Unblock the Notifications