తెలుగులో రిలీజ్ కాబోతున్న బాలీవుడ్ సెన్సేషనల్ హిట్ మూవీ 'ఛావా'.. ఎప్పుడంటే ?

ఛత్రపతి శివాజీ మహరాజ్ తనయుడు శంభాజీ మహరాజ్ జీవితకథగా తెరకెక్కిన సినిమా 'ఛావా'. ల‌క్ష్మ‌ణ్ ఉటేక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు విక్కీ కౌశల్, ర‌ష్మిక జంట‌గా నటించారు. నటించారు అనడం కంటే జీవించారు అనడంలో ఏ సందేహం అక్కర్లేదు అని చెప్పాలి. విక్కీ కౌశల్ నటన వేరే లెవల్‌లో ఉంది. మడాక్‌ ఫిల్మ్స్‌ పతాకంపై దినేశ్‌ విజన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ నెల‌ 14న విడుద‌లైన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద కాసులవ‌ర్షం కురిపిస్తోంది. 12 రోజుల్లోనే ఏకంగా రూ.500 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది.

అయితే ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఛావా సినిమాను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ తెలుగులో విడుద‌ల చేయబోతున్నట్టు ప్రకటించింది. మార్చి 7న తెలుగులో రిలీజ్ చేస్తున్న‌ట్లు సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసింది. గొప్ప‌ ప్రజాదరణ పొందిన ఛత్రపతి శివాజీ మహరాజ్ తనయుడు శంభాజీ మహరాజ్ ఇతిహాస గాథ ఇప్పుడు తెలుగులో గర్జించడానికి సిద్ధంగా ఉందని ఆ పోస్టులో రాసుకోచ్చింది. ఈ మేరకు ఒక పోస్ట‌ర్‌ను కూడా విడుద‌ల చేసింది.

Bollywood sensational hit movie chhavva is going to be released in Telugu

ఇక ఈ సినిమాపై ఇప్పటికే కామన్ ఆడియన్స్ నుంచి రివ్యూవర్ల వరకూ ఎంతో మంది సెలబ్రెటీల నుంచి రాజకీయ నాయకుల వరకూ ప్రశంసలు కురిపించారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ సినిమాని మెచ్చుకున్నారు. మన దేశ చరిత్రని తెలియజేసే, మన వీరుల పోరాటాన్ని చూపించే ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని ఆకాంక్షించారు.

ఈ సినిమాలో శంభాజీ మహరాజ్.. మొగలులతో చేసిన యుద్ధం, మరాఠా సామ్రాజ్యాన్ని ఏకతాటిపైకి తెచ్చిన సన్నివేశాలు ఆడియన్స్‌కి గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. అలానే క్లైమాక్స్‌లో ఔరంగజేబు చేతిలో శంభాజీ నరకం చూసిన సన్నివేశాలు చూసి ఆడియన్స్‌ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాని చూస్తూ ఆడియన్స్ ఎమోషనల్ అవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+