ప్రభాస్ మూవీలో బాలీవుడ్ స్టార్.. ఫొటోలు వైరల్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న చిత్రాల్లో హను రాఘవపూడి డైరెక్షన్ లో చేస్తున్న ఫౌజీ మూవీ ఒకటి. సీతారామం చిత్రంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ హను రాఘవపూడి. ఆయన తదుపరి చేస్తున్న చిత్రం ఇదే కావడంతో హను- ప్రభాస్ కాంబినేషన్ పై ఇండస్ట్రీతో పాటు అటు ఫ్యాన్స్ లోనూ విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో కొత్త కథానాయిక ఇమాన్వి ని హీరోయిన్ గా తీసుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ అప్టేట్ వచ్చింది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ అనుపమ్ ఖేర్ ఈ సినిమాలో ఓ కీలక రోల్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన అధికారిక ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేశారు.
" నా 54 వ చిత్రానికి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ తెలియజేసేందుకు నేను చాలా సంతోషిస్తున్నా. ఈ సినిమాను నేను బాహుబలి ఆఫ్ ఇండియన్ సినిమా ప్రభాస్ తో కలిసి నటిస్తున్నా. ఈ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకు నా స్నేహితుడు సుదీప్ ఛటర్జీ.. డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ గా పనిచేస్తున్నారు" అని అనుపమ ఖేర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ తో పాటు ప్రభాస్ తో కలిసి దిగిన ఫొటోను ఆయన షేర్ చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలో ప్రభాస్ స్టైలిష్ లుక్ తో ఆకట్టుకున్నారు. ఆయన గడ్డం, హెయిర్ క్రాఫ్ స్టయిలిష్ గా ఉంది. దీంతో ఫ్యాన్స్ ఈ పిక్ ను తెగ షేర్ చేస్తున్నారు.

ఇక ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ ఏప్రిల్ 10న విడుదల కానుంది. దీంతోపాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ ప్రభాస్ 25వ సినిమాగా తెరకెక్కుతోంది. ఈ మూవీతోపాటు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో కల్కి 2, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ 2 చిత్రాల్లోనూ ప్రభాస్ నటిస్తున్నారు.












Click it and Unblock the Notifications