కూతురు వయసున్న అమ్మాయితో మూడో పెళ్లికి రెడీ అయిన స్టార్ హీరో
ఈ రోజుల్లో ప్రేమ, ఎపైర్,పెళ్లి, బ్రేకప్, విడాకులు అనేవి సర్వ సాధారణంగా మారాయి. గతంలో సామాన్యుల జీవితాల్లో ప్రేమ, పెళ్లి , విడాకులు అనేవి కనిపించేవి కాదు. కానీ మారుతున్న కాలంతో పాటు మనుషులు కూడా మారుతున్నారు. అయితే ఈ రోజుల్లో సామాన్యుల జీవితాల్లో కూడా ఎఫైర్స్, విడాకులు అనేవి కామన్‌గా మారిపోయాయి. ఇక సినీ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. సెలబ్రిటీలు పెళ్లి , విడాకులు అనేవి కామన్‌గా మారిపోయింది. ఏ రోజున ఏ సెలబ్రిటీ విడాకులు గురించి ప్రకటిస్తారో అని విధంగా పరిస్థితి మారిపోయింది .
ఇక విడిపోయిన వారు మరో పెళ్లి చేసుకోవడానికి కూడా ఏమాత్రం సంకోచించడం లేదనే చెప్పాలి.ఇలా విడాకులు తీసుకున్న చాలామంది మరో పెళ్లి చేసుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో ముచ్చటగా మూడో పెళ్లికి రెడీ అయ్యాడు.బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్‌లో మిస్టర్ ఫర్‌ఫ్టెక్ట్‌గా పేరుగాంచిన ఆమిర్ ఖాన్ వరుస హిట్లతో తన స్టార్‌డంను అమాంతం పెంచుకున్నారు.

ఆమిర్ ఖాన్ తన సినిమాలలో సామాజిక సందేశాలను అందించడానికి ప్రయత్నిస్తుంటారు. ఆయన 'సత్యమేవ జయతే' అనే టెలివిజన్ కార్యక్రమం ద్వారా సామాజిక సమస్యలపై ప్రజలలో అవగాహన కల్పించడానికి కృషి చేశారు.ఆమిర్ ఖాన్ భారతీయ సినిమాకు చేసిన కృషికి గాను అనేక పురస్కారాలు అందుకున్నారు. ఆయనకు పద్మశ్రీ మరియు పద్మభూషణ్ వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు లభించాయి. ఇదే సమయంలో ఆయన వ్యక్తిగత జీవితం కూడా అనేక వివాదాలకు దారి తీసింది.
ఆమిర్ ఖాన్ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇద్దరి భార్యలకు ఆయన విడాకులు ఇచ్చారు.ఆమిర్ ఖాన్ 1986 లో రీనా దత్తాను వివాహం చేసుకున్నారు.వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు: జునైద్ ఖాన్ , ఐరా ఖాన్. మొదటి భార్య రీనా దత్తాకు 2002లో విడాకులు ఇచ్చారు.మూడేళ్ల పాటు సింగిల్‌గా ఉన్న ఆమిర్ ఖాన్ 2005లో కిరణ్ రావును రెండో వివాహం చేసుకున్నారు.వారికి ఆజాద్ రావు ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు. అభిప్రాయభేదాలు తలెత్తడంతో వీరు 2021లో విడాకులు తీసుకున్నారు.ఆమిర్ ఖాన్ ప్రస్తుతం మూడో పెళ్లికి రెడీ అవుతున్నారు.
ఆమిర్ ఖాన్ ఆ మధ్య నటితో ఫాతిమా సనా షేక్‌తో రిలేషన్‌లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. ఫాతిమా సనా షేక్ కారణంగానే కిరణ్ రావుకు ఆమిర్ ఖాన్ విడాకులిచ్చారనే రూమర్స్ తెర మీదకు వచ్చాయి. ఇదే సమయంలో వీరిద్దరు క్లోజ్‌గా మూవ్ అవుతున్న ఫొటోలు సైతం నెట్టింట వైరల్‌గా మారడంతో , వీరి రిలేషన్ గురించి పెద్ద ఎత్తున చర్చ సాగింది. అయితే ఇవన్ని కూడా కేవలం ప్రచారం వరకు మాత్రమే మిగిలిపోయాయి.
సరిగ్గా ఇదే సమయంలో మూడో పెళ్లిపై ఆమిర్ ఖాన్ కీలక ప్రకటన చేశారు. తాను ఓ అమ్మాయితో డేటింగ్ చేస్తున్నానని ఆయన తెలిపారు.గౌరీ స్ప్రాట్ అనే అమ్మాయితో తాను రిలేషన్‌లో ఉన్నానని ఆమిర్ ఖాన్ ప్రకటించారు.25 సంవత్సరాలుగా తనకు ఆమె తెలుసని అన్నారు. గౌరీ స్ప్రాట్ ఇప్పటికే వివాహం అయింది. తన మొదటి భర్తకు ఆమె విడాకులిచ్చారు. వీరికి ఆరేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. త్వరలోనే ఆమెను మూడో వివాహం చేసుకోబోతున్నట్టు ఆమిర్ ఖాన్ స్పష్టం చేశారు.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ బిలియనీర్‌గా రాజభోగాలు -
ఓటీటీలో జనాలు ఎగబడి చూస్తున్న సినిమా ఇదే.. మీరు చూశారా? -
ప్రశాంత్ వర్మ మ్యాజిక్.. అక్షయ్ ఖన్నా రోల్ మామూలుగా లేదుగా! -
"'ధురంధర్' సినిమానే కాదు.. ప్రభుత్వానికి రాసిన ప్రేమలేఖ" -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !!












Click it and Unblock the Notifications