2 ఫ్లాట్లు అమ్మేసిన స్టార్ హీరో
దేశవ్యాప్తంగా చలనచిత్ర పరిశ్రలో ఒక వార్త వైరల్ గా మారింది. బాలీవుడ్ యంగ్ హీరో రణవీర్ సింగ్ తన లగ్జరీ ఫ్లాట్లు రెండు అమ్మేసుకున్నట్లు తెలుస్తోంది. తనకు కోట్లరూపాయల ఆస్తులున్నాయి. అమ్మిన ఈ రెండు ఫ్లాట్లు ఎంతో ఇష్టపడి కొనుక్కున్నాడు. అకస్మాత్తుగా వాటిని ఎందుకు అమ్మేశాడా? అని అందరిలో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాను ఈ వార్త షేక్ చేస్తోంది.
వెస్ట్రన్ ఎక్స్ ప్రెస్ హైవే లో ఉన్న రెండు అపార్ట్ మెంట్లను రూ.17.25 కోట్లకు అమ్మేసినట్లు తెలుస్తోంది. సిటీలోని ఘోరగావ్ ఈస్ట్ రీజియన్ లోని ఒబెరాయ్ ఎక్స్ పిక్ సైట్ లోని 43వ అంతస్తులు 1234 చదరపు అడుగుల స్థలం, 6 పార్కింగ్ ఏరియాస్ కలిగిన ఈ అపార్ట్ మెంట్ లింగ్ డీల్ నవంబర్ 6న ఫైనల్ అయింది. ఉన్నపళంగా రణవీర్ సింగ్ తన ఇష్టమైన ఫ్లాట్స్ అమ్ముకోవడానికి కారణం ఏమిటంటే.. బాంద్రా వెస్టులో క్వార్టర్ ఫ్లెక్స్ హౌస్ ను కొనుగోలు చేశాడు. దీనివల్లే వీటిని అమ్మేయాల్సి వచ్చింది. ఎంటర్ టైన్మెంట్ రంగంలో పెట్టుబడి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

రణవీర్ సింగ్ ఇప్పటివరకు ఐదు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో సహా అనేక అవార్డులను గెలుచుకున్నాడు. భారతదేశానికి చెందిన నటుల్లో అత్యధిక పారితోషికం తీసుకునేవారిలో ఆయన కూడా ఒకరు. 2012 నుంచి ఫోర్బ్స్ టాప్-100 జాబితాలో ఉంటున్నాడు. ఇండియానా యూనివర్శిటీ బ్లూమింగ్టన్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత , యష్ రాజ్ ఫిల్మ్స్ రొమాంటిక్ కామెడీ బ్యాండ్ బాజా బారాత్ (2010) సినిమాతో బాలీవుడ్ లోకి ప్రవేశించారు. మొదటి చిత్రానికే ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకోగా తర్వాత సినిమాకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డును గెలుచుకున్నాడు.












Click it and Unblock the Notifications