ఆ హీరోతో నటించొద్దు.. జాన్వీకి బోనీకపూర్ కండిషన్?
దివంగత నటి శ్రీదేవి వారసురాలుగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టారు జాన్వీకపూర్. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో పాటు సౌత్ సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న దేవర సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు ఈ సినిమాతో ఆమె తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నారు.
బాలీవుడ్ తోపాటు దక్షిణాది సినీ పరిశ్రమల్లోకూడా బిజీ అవుతున్నారు. దక్షిణ భారతదేశానికి సంబంధించిన సినీ పరిశ్రమల్లోకి ప్రవేశించేటప్పుడు ఆమె తండ్రి బోనీకపూర్ హీరోల విషయంలో కొన్ని కండిషన్స్ పెట్టినట్లు సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారింది. తమిళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టేటప్పుడు విజయ్ లేదంటే అజిత్ సినిమాలద్వారానే వెళ్లాలని తెలియజేశారు. తమిళ చిత్ర పరిశ్రమలో హీరో ధనుష్ తో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను నటించవద్దని జాన్వీకపూర్ కు బోనీ కపూర్ కండిషన్ పెట్టారంటూ సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారింది. కోలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటికీ ధనుష్ తో వద్దు అని బోనీకపూర్ ఎందుకు చెప్పారనేది చర్చనీయాంశంగా మారింది. ధనుష్ తమిళంతోపాటు తెలుగు, హిందీలో కూడా సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్ అయ్యారు.

స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ధనుష్ సినిమాల్లో తన కుమార్తె నటించకూడదని బోనికపూర్ ఎందుకు కండిషన్ పెట్టారో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరలవుతోంది. దీనిపై ధనుష్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోనీ కపూర్, తన కుమార్తె గురించి వస్తున్నటువంటి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో లేదో తెలియదు కానీ ఈ వార్త మాత్రం హల్చల్ చేస్తుంది












Click it and Unblock the Notifications