కూలీ vs వార్ 2 : దొందూ దొందే

భారీ అంచనాల మధ్య విడుదలైన వార్ 2 , కూలీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఒక రసవత్తరమైన పోరుకు తెరతీశాయి. తొలి రోజు కలెక్షన్స్‌లో కూలీ సినిమా మాస్ బజ్‌తో దూసుకుపోగా, అంచనాలను అందుకోలేకపోయిన వార్ 2 వెనుకబడింది. అయితే, ప్రేక్షకుల నుండి రెండు సినిమాలకూ మిశ్రమ స్పందన రావడం విశేషం.ఈ రెండు భారీ బడ్జెట్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద నువ్వా-నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ 'వార్ 2':
'వార్ 2' సినిమాకు ఆశించినంత భారీ ఓపెనింగ్స్ రాలేదు. మొదటి రోజు మిక్స్‌డ్ టాక్‌తో పర్వాలేదనిపించిన ఈ చిత్రం, రెండో రోజు ఇండిపెండెన్స్ వీకెండ్ అడ్వాంటేజ్ తో హిందీలో అద్భుతమైన జోరును చూపించింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 'కూలీ' సినిమా ప్రభావం వలన కలెక్షన్స్ కొంత తగ్గినా, ఆంధ్ర, సీడెడ్ ప్రాంతాల్లో మంచి వసూళ్లు సాధించింది. రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో ₹6-7 కోట్ల షేర్ సాధించే అవకాశం ఉంది. హిందీలో మొదటి రోజుతో పోలిస్తే 30% గ్రోత్ చూపిస్తూ, ₹38-40 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించవచ్చని అంచనా. ఓవర్సీస్ లో ఓకే అనిపించినా, మొత్తం మీద రెండో రోజు ప్రపంచవ్యాప్తంగా ₹66-70 కోట్ల గ్రాస్ సాధించవచ్చు. తెలుగులో మరింత సాలిడ్ జోరు చూపించాల్సిన అవసరం ఉంది.

Box Office Battle Coolie vs War 2

రజనీకాంత్ 'కూలీ':
సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జునల 'కూలీ' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తోంది. కోలీవుడ్‌లో ఆల్-టైం రికార్డ్ ఓపెనింగ్స్ సాధించి మొదటి రోజు దుమ్ము రేపింది. రెండో రోజు కూడా అద్భుతమైన హోల్డ్ చూపిస్తూ దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు డబుల్ డిజిట్ గ్రాస్ మార్క్ అందుకునే అవకాశం ఉంది. తమిళనాడులో ₹28-30 కోట్ల గ్రాస్ సాధించవచ్చని అంచనా. కర్ణాటక, కేరళ, రెస్ట్ ఆఫ్ ఇండియాలో ₹15 కోట్ల గ్రాస్ మార్క్ ను అవలీలగా అందుకునే అవకాశం ఉంది.

ప్రపంచవ్యాప్తంగా రెండో రోజు ₹82-85 కోట్ల గ్రాస్ సాధించవచ్చని అంచనా. తమిళ సినిమాల పరంగా రెండో రోజు ఆల్-టైం రికార్డు కలెక్షన్స్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.ఈ రెండు సినిమాల ఫైనల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. అయితే మొదటి రెండు రోజుల తర్వాత ఈ రెండూ సినిమాల జోరు తగ్గిందనే చెప్పాలి.కానీ ప్రస్తుతానికి 'కూలీ' సినిమా 'వార్ 2' కన్నా బాక్స్ ఆఫీస్ వద్ద మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నట్లు స్పష్టమవుతోంది.ఈ సుదీర్ఘ సెలవుల వీకెండ్‌లో ఏ సినిమా ఎక్కువ వసూళ్లు చేస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+