డిప్యూటీ సీఎంను ఢీకొట్టబోతున్న అల్లు అర్జున్?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఢీకొట్టబోతున్నాడా? అనే ప్రశ్న తెలుగు ఫిల్మ్ నగర వర్గాల్లో చర్చకు దారితీసింది. వాస్తవానికి మెగా కుటుంబానికి, అల్లు అర్జున్‌కు మధ్య దూరం పెరిగిన సంగతి తెలిసిందే. అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు కాస్తా ఎన్నికల సమయంలో తీవ్రంగా విభేదించే స్థాయికి చేరాయి. దీనికి కారణం నంద్యాల నుంచి పోటీచేస్తున్న వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతివ్వడమేకాదు.. స్వయంగా తన సతీమణితో కలిసి నంద్యాల వెళ్లి మరీ మద్దతు పలికారు.

తిరిగి కలిసిపోలేనంత దూరం
అదే సమయంలో పిఠాపురం నుంచి పోటీచేస్తున్న పవన్ కల్యాణ్ తరఫున బన్నీ తండ్రి అల్లు అరవింద్ తో సహా మెగా కుటుంబ సభ్యులంతా అక్కడికి వెళ్లి స్వయంగా ప్రచారంలో పాల్గొన్నారు. బన్నీ మాత్రం ట్వీట్ తో సరిపెట్టారు. దీంతో పవన్ అభిమానులు ఒక్కసారిగా అల్లు అర్జున్ పై భగ్గుమన్నారు. పవన్ విజయం సాధించిన తర్వాత కూడా బన్నీ మళ్లీ ట్వీట్ తో సరిపెట్టారు. దీంతో మెగా కుటుంబానికి, అల్లు అర్జున్ కు మధ్య ఉన్న విభేదాలు తిరిగి కలిసిపోలేనంత దూరానికి చేరుకున్నాయి.

box office war between hariharaveeramallu and pushpa 2 in december month

రెండు వారాలు డేట్లు ఇస్తే చాలు
ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమా షూటింగ్స్ లో పాల్గొన్నారు. తాజాగా హరిహర వీరమల్లు నిర్మాత ఎం.రత్నం మాట్లాడుతూ పవన్ కల్యాణ్ మూడు వారాలు డేట్లు ఇస్తే వీరమల్లును డిసెంబరులో విడుదల చేస్తామని ప్రకటించారు. డిసెంబరు ఆరోతేదీన పుష్ప2 విడుదల కాబోతోంది.

ఆగస్టు 15న విడుదల కావాల్సిన ఈ సినిమా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విడుదలచేస్తే పరాజయం పాలవుతుందనే అనుమానంతో నిర్మాత, దర్శకులు డిసెంబరు ఆరుకు వాయిదా వేశారు. సినిమా బాగా రాకపోవడంతో సన్నివేశాలను దర్శకుడు సుకుమార్ మళ్లీ తీస్తున్నారని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ డిసెంబరులో హరిహర వీరమల్లు విడుదలైతే తన చినమామయ్య, డిప్యూటీ ఎం అయిన పవన్ ను బన్నీ ఢీకొట్టబోతున్నాడని తెలుగు సినీ పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+