నువ్వెంత? అంటే.. నువ్వెంత? రా.. చూసుకుందాం!
ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు ఎన్నో యుద్ధాలు చూసివుంటాం. అయితే ఈ ఏడాది డిసెంబరు 22వ తేదీన జరగబోతున్న ప్రభాస్-షారుక్ మధ్య మాత్రం ఎపిక్ వార్ జరగబోతోంది. వరుసగా రెండు వెయ్యి కోట్ల రూపాయల సినిమాలిచ్చి ఫామ్ లో ఉన్న షారుక్.. మరోవైపు ప్రశాంత్ నీల్ తో కలిసిన ప్రభాస్ మధ్య జరిగే ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు? అనే ఉత్కంఠ దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో ఏర్పడింది.
పరిశ్రమ వర్గాలు, ట్రేడ్ వర్గాలు మాత్రం వీరిద్దరి మధ్య క్లాష్ రాకూడదని కోరుకుంటున్నారు. అయితే ఇద్దరిలో ఎవరూ వెనక్కి తగ్గేలా కనిపించడంలేదు. ఇద్దరి మధ్యా ఫైట్ జరగడం ఖాయం అని తెలియగానే దక్షిణాది సినీ అభిమానుల, ఉత్తరాది సినీ అభిమానుల మధ్య సోషల్ మీడియ వార్ నడుస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్ షారుక్ సినిమాను టార్గెట్ చేస్తే, షారుక్ ఫ్యాన్స్ ప్రభాస్ సినిమాను టార్గెట్ చేశారు. ప్రభాస్ ఫ్యాన్స్ డుంకీ సినిమాను డాంకీ గా ట్రెండ్ చేశారు. సలార్ ను షారుక్ ఫ్యాన్స్ ఉగ్రం సినిమాకు రీమేక్ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇద్దరు అభిమానులు ఒకరిపై మరొకరు పై చేయి సాధించేందుకు హల్ చల్ చేస్తున్నారు.

ఉగ్రం తన మొదటి సినిమా అని, తాను ఎన్ని సినిమాలు చేసినప్పటికీ ఆ సినిమా ప్రభావం మాత్రం కచ్చితంగా ఉంటుందని ప్రశాంత్ నీల్ ప్రకటించారు. సలార్ సినిమాలో కూడా ఉగ్రం ఛాయలు ఉంటాయా? కన్నడ సినిమాను రీమేక్ చేసి కన్నడలోనే రిలీజ్ చేయడానికి ప్రశాంత్ నీల్ రూ.వందల కోట్లను ఖర్చుపెడతారా? ప్రొడ్యూసర్ ఓకే అంటారా? అనేది కూడా ఆలోచించాలి. కానీ ఇటువంటివేమీ ఆలోచించకుండా షారుక్ ఖాన్ ఫ్యాన్స్ మాత్రం సలార్ పై నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మరీ డెప్త్ గా యుద్ధం జరిగితే షారుక్ సినిమాకు దక్షిణాదిలో నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఉత్తరాదిలో కలెక్షన్లు వస్తాయేమో అని విశ్లేషకులు అంటున్నారు. అదే ప్రభాస్ సినిమాకు మాత్రం దక్షిణాదిలోను, ఉత్తరాదిలోను ఎక్కడా నష్టం జరిగే అవకాశం లేదంటున్నారు. మరి ఏం జరుగుతుందో ఏమిటో వేచిచూడాలి మరి.












Click it and Unblock the Notifications