అప్పుడు మనం సైలెంట్‌గా ఉంటే ఇప్పుడు వాళ్లు కామ్‌గా ఉండేవారుగా..!

పవన్ కళ్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' సినిమా విడుదలకు ముందే తీవ్ర వివాదంలో కూరుకుపోయింది. వైసీపీ వర్సెస్ పవన్ కళ్యాణ్ రాజకీయ వైరం ఇప్పుడు సినిమాను కూడా చుట్టుముట్టింది. #BoycottHHVM హ్యాష్‌ట్యాగ్‌తో ఈ సినిమాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది. కేవలం వైసీపీ కార్యకర్తలే కాదు, ఎన్టీఆర్, మహేశ్‌బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ అభిమానుల్లో కొందరు కూడా పవన్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

గతంలో మహేష్ బాబు 'గుంటూరు కారం', ఎన్టీఆర్ 'దేవర', ప్రభాస్ 'సలార్', అల్లు అర్జున్ 'పుష్ప-2' సినిమాలు విడుదల సమయంలో మెగా అభిమానులు ,ఈ సినిమాలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.ఇప్పుడు ఈ హీరోల ఫ్యాన్స్‌ వంతు వచ్చింది. 'హరిహర వీరమల్లు'కు వ్యతిరేకంగా ఇప్పుడు ఈ హీరోల అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.మా సత్తా ఏంటో ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌కి చూపిస్తాం అంటూ సవాల్ విసురుతున్నారు.

Boycott hariharaveeramallu hashtag trending in social media

ఇక 'హరిహర వీరమల్లు' సినిమాకు వ్యతిరేకంగా వైసీపీ అభిమానులు తమ పనిని ఎప్పుడో మొదలుపెట్టారు. సాధారణంగానే పవన్ కల్యాణ్ అంటే నచ్చని వైసీపీ అభిమానులు, 'హరిహర వీరమల్లు'కు నెగిటివ్‌గా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. #BoycottHHVM అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్విట్టర్‌లో బాగా ట్రెండ్ అవుతోంది. ఇది కేవలం రాజకీయ వర్గాల మధ్యే కాకుండా, సినీ అభిమానుల మధ్య కూడా తీవ్ర చర్చకు దారితీసింది. ఇంత నెగివిటి మధ్య విడుదలవుతున్న 'హరిహర వీరమల్లు' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో వేచి చూడాలి. ఈ వివాదం సినిమా కలెక్షన్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అనేది ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+