బాలయ్య స్టార్ గా మారడానికి ఆమె జాతకమే కారణమా?

తెలుగు సినీ పరిశ్రమలోని స్టార్ హీరోలలో నందమూరి బాలకృష్ణ ఒకరు. తాతమ్మ కల సినిమాతో సినిమాల్లోకి ప్రవేశించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా నటుడిగా ఒక్కో మెట్టు ఎదుగుతూ కెరీర్ పరంగా బాలయ్య సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం బాలకృష్ణ స్టార్ హీరో కావడానికి అతని కుమార్తె బ్రాహ్మణి జాతకమే కారణమని, ఆమె పుట్టిన తర్వాతే బాలయ్యకు బాగా కలిసివచ్చిందని పరిశ్రమలో అందరూ చెబుతారు.

1988 డిసెంబర్ 21వ తేదీ బ్రాహ్మణి జన్మించింది. బ్రాహ్మణి పుట్టిన తర్వాత బాలయ్య నటించిన భలే దొంగ హిట్ గా నిలిస్తే ముద్దుల మావయ్య ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. బాల గోపాలుడు సినిమాతో యావరేజ్ హిట్ ను ఖాతాలో వేసుకున్న బాలయ్య నారీ నారీ నడుమ మురారి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నారు. ఈ సినిమాలవల్లే బాలయ్యకు ఊహించనిరీతిలో స్టార్ డమ్ వచ్చింది.

brahmani horoscope the reason for balakrishna becoming a star hero?

అదే సమయంలో కొన్ని సినిమాలు విడుదలై పరాజయం పాలయ్యాయి. అయితే వాటివల్ల బాలకృష్ణ కెరీర్ దెబ్బతినలేదు. లారీ డ్రైవర్, ఆదిత్య 369, రౌడీ ఇన్ స్పెక్టర్ సినిమాలతో తన రేంజ్ ను పెంచుకున్నారు. బ్రాహ్మణి జాతకం చాలా మంచిదని, ఆమె చేయి పడితే తిరుగుండదని చెబుతారు. అందుకు తగ్గట్లుగానే వ్యాపార రంగంలో కూడా సంచలన విజయాలను ఆమె సొంతం చేసుకుంటోంది.

వ్యాపారానికి, కటుంబానికి మాత్రమే సమయాన్ని కేటాయిస్తున్న బ్రాహ్మణి రాజకీయాల్లోకి వచ్చే అవకాశంలేదు. ఇటీవలే భగవంత్ కేసరి సూపర్ హిట్ కావడంతో బాలయ్య బాబీ సినిమాను మరింత ఉత్సాహంతో చేస్తున్నారు. వరుస విజయాల వల్ల ఈ సినిమా బడ్జెట్ లెక్కలు పెరిగాయని, రోజురోజుకు ఈ సినిమా బడ్జెట్ పెరిగిపోతోందని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+