బిఆర్ఎస్ ఓటమి... వెంటనే పిక్ మార్చిన సురేఖవాణి కూతురు...ట్రోల్ చేస్తున్న నెటిజన్లు...
బిఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం సోషల్‌మీడియాలో చాలామంది సెలబ్రిటీలు క్యాంపెన్ చేశారు. అందులో నటి సురేఖవాణి, కూతురు సుప్రీత కూడా ఉన్నారు. సుప్రిత కూడా ఈ బీఆర్ఎస్ క్యాంపైన్‌లో భాగంగా వీడియో పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ఓటమితో వెంటనే ఆ వీడియోను డిలీట్ చేసింది సుప్రీత. అనంతరం రేవంత్ రెడ్డితో దిగిన ఫోటోను సుప్రిత పోస్ట్ చేసింది. దీంతో ఈమెపై నెటిజన్లు వీపరితంగా ట్రోలింగ్ చేస్తున్నారు. సుప్రీతపై దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. అయితే, బిఆర్ఎస్ క్యాంపెయింగ్‌లో బుల్లితెర సెలబ్రిటీలు చాలామందే పాల్గొన్నారు. యాంకర్ శ్రీముఖి, విష్ణుప్రియ ఇలా చాలా మంది కారు గుర్తుకు ఓట్ వేయాలని ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేసిన సంగతి తెలిసిందే.
Supriya deleted the campaign reel of TRS and updated her insta story with this photo. 😹😹 pic.twitter.com/PnG8wLjUr9
— Satya (@YoursSatya) December 3, 2023
తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది సురేఖ వాణి. తన కుమార్తె సుప్రీతతో కలసి సురేఖ వాణి సోషల్ మీడియాలో కూడా ఎప్పడూ యాక్టివ్‌గా నే ఉంటారు. తల్లీకూతుళ్లు ఇద్దరూ కలిసి చేసే డాన్స్ వీడియోలు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఇలాంటి వీడియోలతో వీరిద్దరూ కొన్ని సార్లు ట్రోలింగ్‌కి కూడా గురవుతుంటారు. ఇప్పడు తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయంలో సురేఖ వాణి కుమార్తె సుప్రీత నెట్టింట తెగ వైరల్ గా మారింది.

దానికి కారణం ఆమె కొన్ని రోజుల క్రితం షేర్ చేసిన బిఆర్ఎస్ క్యాంపెయిన్ వీడియో డిలీట్ చేయడమే. బిఆర్ఎస్ పార్టీ కోసం సోషల్ మీడియాలో క్యాంపైన్ చేసిన సెలబ్రిటీల జాబితాలో సురేఖ వాణి కూతురు సుప్రీతా కూడా ఉంది. సురేఖ వాణి కూడా బీఆర్ఎస్ పార్టీకి తన పూర్తి మద్దతును తెలిపింది. ఆదివారం రోజు వెలువడిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో బీఆర్ఎస్ పార్టీ ఓటమిని చవిచూసిన సంగతి అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో 64 సీట్లు గెలిచి అధికారం దక్కించుకుంది. అయితే, కాంగ్రెస్ గెలిచిన వెంటనే సుప్రీతా బీఆర్ఎస్ వీడియోను డిలీట్ చేసింది. అనంతరం తన తల్లి సురేఖ వాణితో కలసి రేవంత్ రెడ్డితో ఉన్న ఫోటోను షేర్ చేసింది. దీనితో తల్లీ కూతుళ్లపై సోషల్‌మీడియాలో తెగ ట్రోలింగ్ మొదలైంది.

ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేసిన సుప్రీత..
అయితే, సుప్రీత మాత్రం ఈ ట్రోలింగ్‌ను తట్టుకోలేకపోయింది. ట్రోలర్లను ఉద్దేశించి సుప్రిత ఒక ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేసింది. ఈ పొలిటికల్ సిట్యువేషన్ మీద నన్ను చాలా మంది ట్యాగ్ చేస్తూ వేధిస్తున్నారు.. టార్గెట్ చేస్తున్నారు.. ట్రోల్ చేస్తున్నారు.. కొత్త సీఎమ్‌కు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ వేశానంతే..కానీ ఈ ట్రోలింగ్ ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు.. ఇంతలా మీరు నన్ను ద్వేషించడానికి నేనేం మీకు అన్యాయం చేశాను.. ఇది నన్ను మెంటల్‌గా ఎంత బాధ పెడుతుంటుందో మీకు తెలుసా? అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేసింది సుప్రీత.
-
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది












Click it and Unblock the Notifications