ప్రయాణికులకు ఆర్టీసీ సూపర్ వార్త.. ఇక్క బస్సులతో పాటు ఈ ఆటో సేవలు కూడా

తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ ఇటీవల కాలంలో ప్రగతిపథంలో దూసుకుపోతుంది. ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్ ఆర్టీసీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కొత్త చర్యలు చేపడుతోంది. బస్సు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేలా ఎలక్ట్రిక్ ఆటో సేవలను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ప్రణాళికలను అధికారులు సిద్ధం చేశారు.

తెలంగాణా, ఏపీ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త!
తెలంగాణా, ఏపీ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త!

ఎలక్ట్రిక్ ఆటో తయారీ సంస్థలతో చర్చలు

ఆర్టీసీ ఇప్పటికే ప్రయాణికుల కోసం కొత్త బస్సులను ఏర్పాటు చేయటమే కాకుండా లాజిస్టిక్ సేవలతోనూ దూసుకుపోతుంది. ఇక తాజాగా మరో కొత్త నిర్ణయంలో భాగంగా ఎలక్ట్రిక్ ఆటో సేవలను కూడా అందించనుంది. ఈ మేరకు ఎలక్ట్రిక్ ఆటో తయారీ సంస్థలతో చర్చలు జరుపుతోంది. అన్ని ప్రక్రియలు పూర్తయిన తర్వాత సేవలు ప్రారంభం అవుతున్నాయి.

TGSRTC said good news RTC to launch electric auto services in Hyderabad soon Auto services alongside buses

ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం ఆర్టీసీ నిర్ణయం

ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ భావనతో ఈ కొత్త సేవలు ప్రవేశపెట్టబోతున్నారు. మొదట హైదరాబాద్ లో ఈ సేవలు ప్రారంభించనున్నారు.ప్రయాణికులు ఇంటి నుండి సమీప బస్ స్టాప్ కు, గమ్య స్థానం బస్ స్టాప్ నుండి చివరి గమ్యానికి సులభంగా చేరుకునేలా ఎలక్ట్రిక్ ఆటోలు ఉపయోగపడతాయి. బస్సు ప్రయాణంలో ఎదురయ్యే రవాణా ఇబ్బందులను తొలగించటానికి ఈ ఎలక్ట్రిక్ ఆటోలు తీసుకొచ్చే ఆలోచన ప్రభుత్వం చేసింది.

మినీ మాల్దీవులుగా సోమశిల, క్రూయిజ్ విహారం.. తెలంగాణా టూరిజం నయా ప్లాన్!
మినీ మాల్దీవులుగా సోమశిల, క్రూయిజ్ విహారం.. తెలంగాణా టూరిజం నయా ప్లాన్!

బస్సు టికెట్ తో పాటు ఎలక్ట్రిక్ ఆటో టికెట్ కూడా ఒకేసారి బుకింగ్

ప్రయాణికులు బస్సు టికెట్ తో పాటు ఎలక్ట్రిక్ ఆటో టికెట్ కూడా ఒకేసారి బుక్ చేసుకోవచ్చు. ఒకే బుకింగ్ తో పూర్తి ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునే వీలు ఉంటుంది. దీంతో సమయం, శ్రమ రెండూ ఆదా అవుతాయి. మొదట వీటిని హైదరాబాద్ లో ప్రారంభించాలని భావిస్తున్న క్రమంలో రోజువారీ బస్సులపై ఆధారపడే వేలాదిమంది ప్రయాణికులకు ఈ ఎలక్ట్రిక్ ఆటో సేవలు ప్రయోజనకరంగా మారనున్నాయి.

కాలుష్య నివారణకు, గ్రీన్ ట్రాన్స్పోర్ట్ కు దోహదం

బస్సు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చే ఈ నిర్ణయం ప్రయాణికులకు సంతోషం కలిగిస్తుంది. ఎలక్ట్రిక్ ఆటోలను ఆర్టీసీ తమ పరిధిలోకి తీసుకొచ్చి ప్రయాణికులకు లబ్ది చేకూర్చటమే కాకుండా, కాలుష్య నివారణకు, గ్రీన్ ట్రాన్స్పోర్ట్ కు దోహదం చేస్తుంది. మరి ఈ విధానం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+