నేషనల్ అవార్డు పోయింది, బెయిల్ రద్దు..? జానీకి 'మాస్టర్' స్ట్రోక్
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ జానీ మాస్టర్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిన విషయమే. జానీ మాస్టర్ తనని లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆయన దగ్గర పని చూసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబైలోని హోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని యువతి తన ఎఫ్ఐఆర్ కాపీలో చెప్పుకొచ్చింది.బాధితురాలు మైనర్‌గా ఉన్నపుడు నుంచే ఆమెపై అత్యాచారం చేశారనే ఆరోపణలతో పలు సెక్షన్లతో పాటు ఆయనపై పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసుల నుంచి తప్పించుకుని తిరిగిన జానీ మాస్టర్‌ను గోవాలో అదుపులోకి తీసుకున్నారు.
కోర్టు జానీ మాస్టర్‌కు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.అయితే తనకు ఉత్తమ జాతీయ అవార్డు వచ్చిందని, ఆ కార్యక్రమానికి హాజరుకావాలని బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా.. పరిశీలించిన రంగారెడ్డి న్యాయస్థానం ఈనెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ బెయిల్ మంజూరు చేసింది. అనంతరం అక్టోబరు 10వ తేదీ ఉదయం 10 గంటలకు కోర్టు ఎదుట హజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ సమయంలో మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని, అలాగే మరోసారి మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేయవద్దని కోర్టు ఆదేశించింది. అయితే ఇక్కడే జానీ మాస్టర్‌కు ఊహించని షాక్ తగిలింది. జాతీయ అవార్డుల కమిటీ జానీ మాస్టర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

జానీ మాస్టర్‌కు కేటాయించిన ఉత్తమ జాతీయ అవార్డును రద్దు చేస్తోన్నట్టు కమిటీ ప్రకటించింది. ఆయనపై పోక్సో కేసు నమోదు కావడంతో నేషనల్ అవార్డును రద్దు చేస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీంతో జానీ మాస్టర్‌కు ఎదురు దెబ్బ తగిలినట్టు అయింది. అయితే అవార్డు రద్దు కావడంతో దీని ప్రభావం ఆయన బెయిల్ మీద పడే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే అవార్డు తీసుకునే కారణంతోనే జానీ మాస్టర్ కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అవార్డు రద్దు చేయడంతో జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ కూడా రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. జాతీయ అవార్డు వెనక్కి తీసుకోవడం జానీ మాస్టర్ కెరీర్‌కు పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పాలి. తమిళ హీరో ధనుష్ నటించిన తిరుచిట్రంబలం సినిమాకు ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్‌కు ఇటీవల నేషనల్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఈ అవార్డు అందుకునేలోపే జానీ మాస్టర్ ఇలా లైంగిక వేధింపుల కేసులో దొరికిపోయారు.












Click it and Unblock the Notifications