ఇదేం పోయేకాలం..ఎద అందాలపై మోదీ ఫొటోతో హీరోయిన్ అసభ్య ప్రదర్శన
ప్రపంచ ఫ్యాషన్ ప్రియులను ఉర్రూతలూగించే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, ఈసారి వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. రెడ్ కార్పెట్‌పై సెలబ్రిటీలు, మోడల్స్ ప్రదర్శిస్తున్న చిత్రవిచిత్ర ఫ్యాషన్, బిహేవియర్ పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొందరు మోడల్స్ బట్టలు విప్పేసి, ఇంకొందరు చిరిగిన దుస్తులతో కనిపించి షాక్ ఇచ్చారు. ఈ కోవలోనే భారతీయ నటి రుచి గుజ్జర్ ప్రదర్శించిన ఫ్యాషన్, సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది.
కేన్స్ రెడ్ కార్పెట్‌పై సంప్రదాయ భారతీయ లెహెంగాలో కనిపించిన రుచి గుజ్జర్, డీప్ నెక్ జాకెట్, మ్యాచింగ్ ఇండియన్ జ్యువెలరీతో అందంగానే ఉంది. అయితే, ఈ అవుట్‌ఫిట్‌పై ఆమె ధరించిన ఒక నెక్లెస్ తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆ నెక్లెస్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోలు ఉండటం, అవి ఆమె వక్షోజాలపైకి వచ్చేలా ధరించడం పట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రుచి గుజ్జర్ ప్రవర్తన పట్ల నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, లైమ్‌లైట్‌లోకి వచ్చేందుకు ఇంత చీప్‌గా బిహేవ్ చేయాలా?" అని ప్రశ్నిస్తున్నారు. "ఉప్పొంగే అందాలతో ఏం చేద్దామనుకుంటున్నావ్? ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ కావాలా లేక డబ్బులు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావా? అని మరికొందరు ఆమెను టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇటీవల కాలంలో కొందరు సెలబ్రిటీలు, మోడల్స్ ఫ్యాషన్ పేరిట హద్దులు మీరి అంగాంగ ప్రదర్శనలకు పాల్పడటం, అసభ్యకరమైన ప్రవర్తన కనబరచడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కేన్స్ ఫెస్టివల్ స్థాయిని, గౌరవాన్ని దిగజారుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సెలబ్రిటీలు తమ ప్రవర్తన, ఫ్యాషన్ ఎంపికల విషయంలో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, కేవలం లైమ్‌లైట్‌లోకి వచ్చేందుకు చీప్ ట్రిక్స్‌ను ఆశ్రయించవద్దని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications