పుష్ప విల‌న్ ఫ‌హాద్ ఫాజిల్‌పై కేసు న‌మోదు...

పుష్ప విల‌న్ ఫ‌హాద్ ఫాజిల్‌పై కేసు న‌మోద‌య్యింది. ఫ‌హాద్ నిర్మిస్తున్నపింకేలీ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఈ సినిమా షూటింగ్‌ను ఇటీవ‌లే కేర‌ళ‌లోని ఎర్నాకులం ప్ర‌భుత్వాసుప‌త్రిలోని ఎమ‌ర్జెన్సీ వార్డులో చిత్రీక‌రించడం జ‌రిగింది. అయితే, సాధార‌ణ రోగుల‌ను అందులోకి వెళ్లేందుకు అనుమ‌తించ‌క‌పోవ‌డంతో వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ వ్య‌వ‌హారాన్ని సుమోటోగా తీసుకున్న మాన‌వ‌హ‌క్కుల క‌మిష‌న్‌.. నిర్మాత ఫ‌హాద్ ఫాజిల్‌పై కేర‌ళ‌లో కేసు న‌మోదు చేసింది. పింకేలీ చిత్రంలో ఫ‌హాద్ న‌టిస్తుండ‌డం విశేషం.

ఫ‌హాద్ ఫాజిల్‌ స్వతహాగా మలయాళ నటుడు. నిర్మాతగానూ పలు సినిమాలు తీసి విజ‌యాల‌ను సొంతం చేసుకున్నాడు. ఇటీవ‌లే విడుద‌లైన 'ఆవేశం' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. మలయాళంలో నిర్మాతగా ఫహాద్ పలు సినిమాలు కూడా చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే పింకేలీ సినిమా షూటింగ్‌ను ఓ ప్ర‌భుత్వాసుప‌త్రిలోని ఎమ‌ర్జ‌న్సీ వార్డులో చేశారు. గురువారం రాత్రంతా ఎమ‌ర్జ‌న్సీ వార్డులో షూటింగ్ చేయడంతో అక్కడున్న రోగులు చాలా ఇబ్బంది పడ్డారు.

Case registered against Pushpa villain Fahadh Faasil

అసలు అత్యవసర విభాగంలో షూట్ కోసం ఎలా అనుమ‌తి ఇచ్చారని చెప్పి ఎర్నాకులం జిల్లా వైద్యాధికారి బీనా కుమారి కూడా చిత్ర యూనిట్‌పై సీరియస్ అయ్యారు. ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అయితే, సినీ నిర్మాతల సంఘం మాత్రం ఈ ఆరోపణల్ని కొట్టిపారేసింది. రాత్రి షూటింగ్ కోసం రూ.10 వేలు చెల్లించామంటూ చెప్పింది.

అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని సుమోటోగా తీసుకున్న కేరళ మానవ హక్కుల సంఘం మాత్రం నిర్మాత ఫహాద్ ఫాజిల్‌పై కేసు పెట్టింది. ఫ‌హాద్ ఫాజిల్ తెలుగులో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన పుష్ప చిత్రంలో విల‌న్‌గా న‌టించిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ సినిమాతో ఈయ‌న తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+