దుల్కర్ సల్మాన్‌కి బిగ్ షాక్.. లైంగిక వేధింపుల కేసు !

మలయాళ సినీ పరిశ్రమలో తీవ్ర వివాదం తెరపైకి వచ్చింది. స్టార్ హీరోగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. ఆయనకి చెందిన నిర్మాణ సంస్థ "వేఫేరర్ ఫిలిమ్స్" పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే దుల్కర్‌.. ఈ రకమైన వివాదంలో ఇరుక్కోవడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

దుల్కర్ సల్మాన్ 2019లో వేఫేరర్ ఫిలిమ్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ బ్యానర్ ద్వారా "వరానే అవశ్యముంద్", "కురుప్", "సీతారామం" (మలయాళ వెర్షన్) వంటి హిట్ సినిమాలు తెరకెక్కాయి. రీసెంట్ గానే లోకా మూవీ భారీ హిట్ అందుకున్నారు. అయితే లేటెస్ట్ గా ఈ సంస్థలో పని చేసిన వ్యక్తి కారణంగా ఈ పేరు వివాదాల్లో చిక్కుకుంది.

casting-couch-allegations-on-person-working-in-dulquen-salman-production-house

అసిస్టెంట్ డైరెక్టర్‌ పై ఆరోపణలు..

వేఫేరర్ ఫిలిమ్స్ పేరును వాడుకుని దినిల్ బాబు అనే వ్యక్తి ఒక యువతిని లైంగికంగా వేధించాడని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు మేరకు.. దినిల్ బాబు సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి తనను మోసం చేశాడని పేర్కొంది. కొత్త సినిమా కోసం ఆడిషన్ జరుగుతుందని చెప్పి, పనమ్మిల్లి నగర్‌లోని కార్యాలయ సమీపంలోని భవనానికి రమ్మని పిలిచాడని తెలిపింది. అక్కడికి వెళ్లిన తర్వాత ఆమెను ఒక గదిలోకి తీసుకెళ్లి లైంగికంగా వేధించడానికి ప్రయత్నించాడని.. తాను సహకరించకపోతే మలయాళ సినిమాల్లో అవకాశం రాదని బెదిరించాడని బాధితురాలు వివరించింది.

ఈ ఘటనకు సంబంధించి బాధితురాలు ఎర్నాకులం పోలీస్ స్టేషన్‌లో అధికారిక ఫిర్యాదు చేసింది. ఆమె తనతో జరిగిన చాట్‌లు, వాయిస్ మెసేజ్‌లను కూడా పోలీసులకు సమర్పించింది. కాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దినిల్ బాబుపై 354A, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం.

ఇక ఈ ఆరోపణల నేపథ్యంలో వేఫేరర్ ఫిలిమ్స్ వెంటనే పత్రికా ప్రకటన విడుదల చేసింది. తమ సంస్థతో దినిల్ బాబుకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆయన తమ సంస్థలో ఉద్యోగిగా పనిచేయలేదని.. తమ నిర్మాణంలో ఉన్న ఏ ప్రాజెక్ట్‌కి కూడా ఆయనకు సంబంధం లేదని పేర్కొంది. సంస్థ పేరును దుర్వినియోగం చేసినందుకు అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.

అలానే తేవర పోలీస్ స్టేషన్‌లో, ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ (FEFKA) వద్ద కూడా దినిల్ బాబు పై ఫిర్యాదు చేసినట్టు వెల్లడించింది. మరోవైపు దుల్కర్ సల్మాన్‌ ఈ ఘటనపై ఇంకా స్పందించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+