ULLU పై దెబ్బేసిన కేంద్రం: ఈ ;పాతిక అడల్ట్ కంటెంట్ యాప్స్ ఓపెన్ చేశారో..
సెక్సువల్ కంటెంట్, పోర్నోగ్రఫీకి సంబంధించిన ఓ పాతిక యాప్ లపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. వాటిపై నిషేధం విధించింది. ఇకపై ఆయా యాప్ లేవీ కూడా పని చేయవు. అవన్నీ కూడా డీయాక్టివేట్ అవుతాయి. వాటి కంటెంట్ ను ఏ రకంగా కూడా చూసే అవకాశం ఉండకపోవచ్చు.
ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తంగా 25 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. సాఫ్ట్ పోర్న్ కంటెంట్‌ను అందించే ఈ యాప్‌లపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. ఈ జాబితాలో ఉల్లు, ఆల్ట్, దేశీఫ్లిక్స్, బిగ్ షాట్స్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి.

చట్టవిరుద్ధమైన, అభ్యంతరకరమైన డిజిటల్ కంటెంట్‌పై కఠినంగా వ్యవహరిస్తామని కేంద్ర వెల్లడించింది. దేశంలో 25 వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఆ వెబ్‌సైట్‌లను వెంటనే బ్లాక్ చేయాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు (ISPలు) స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
డిజిటల్ ఎంటర్టైన్మెంట్ లో అసభ్యతను అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. 25 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, వాటికి సంబంధించిన మొబైల్ అప్లికేషన్‌లను ప్రభుత్వం నిషేధించింది. ఈ వేదికలు అసభ్యకరమైన కంటెంట్‌ను కలిగి ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. వాటిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రం అభిప్రాయపడింది.
వివిధ దర్యాప్తు సంస్థల నుండి వచ్చిన సమాచారం ఆధారంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. లైంగికంగా అసభ్యకర, చట్టవిరుద్ధ, సాంస్కృతిక ప్రమాణాలకు విరుద్ధమైన కంటెంట్‌ను అరికట్టే లక్ష్యంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. నిషేధిత జాబితాలో ప్రైమ్ ప్లే, హంటర్స్, డ్రీమ్ ఫిల్మ్స్, రంగీన్, నియాన్ఎక్స్ VIP వంటి అప్లికేషన్లు కూడా ఉన్నాయి.
ఈ ప్లాట్‌ఫారమ్‌లు అడల్ట్ ఎంటర్టైన్మెంట్ పేరుతో ఎరోటిక్, సెమీ-పోర్నోగ్రఫిక్ వెబ్ సిరీస్‌లను టెలికాస్ట్ చేస్తోన్నాయనే విమర్శలు ఉన్నాయి. ఈ యాప్‌లు కంటెంట్ సర్టిఫికేషన్, ఏజ్-గేటింగ్ సంబంధించిన నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని గుర్తించారు. ఐటీ రూల్స్- 2021 ప్రకారం స్వీయ-నియంత్రణ చట్రాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, ఈ ప్లాట్‌ఫారమ్‌లు నిబంధనలను దాటవేస్తున్నాయని ప్రభుత్వం పేర్కొంది.
మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం- ఈ ప్లాట్‌ఫామ్‌లను ఎక్కువగా మొబైల్ యాప్‌ల ద్వారా యాక్సెస్ చేస్తున్నారు. ఇవి థర్డ్-పార్టీ యాప్ స్టోర్‌లలో ఉచితంగా లభిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియాలో కూడా వీటిని ప్రోత్సహిస్తున్నారు. నిషేధంలో భాగంగా మొబైల్ అప్లికేషన్‌లతో పాటు సంబంధిత వెబ్‌సైట్‌లను కూడా బ్లాక్ చేశారు.
ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద అత్యవసర అధికారాలను ఉపయోగించి ఈ యాప్‌లను తొలగించింది. ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్‌ను నిలిపివేసింది. ఐటీ చట్టం, 2000లోని సెక్షన్లు 67, 67Aతో పాటు, భారతీయ న్యాయ సంహిత, 2023లోని సెక్షన్ 294, అసభ్యకరమైన మహిళల ప్రాతినిధ్యం (నిషేధం) చట్టం, 1986లోని సెక్షన్ 4ను కూడా ప్రభుత్వం ప్రయోగించింది.
ప్రభుత్వం నిషేదించిన యాప్ లలో ALTT, ULLU, Big Shots App, Desiflix, Boomex, Navarasa Lite, Gulab App, Kangan App, Bull App, Jalva App, Wow Entertainment, Look Entertainment, Hitprime, Feneo, ShowX, Sol Talkies, Adda TV, HotX VIP, Hulchul App, MoodX, NeonX VIP, Fugi, Mojflix, Triflicks ఉన్నాయి.












Click it and Unblock the Notifications