ఊహించని క్లైమాక్స్‌తో అదరగొట్టిన చిన్న సినిమా!

పెద్ద సినిమాల సందడి లేని ఈ వారంలో, బాక్సాఫీస్ వద్దకు వచ్చి ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంటున్న చిన్న చిత్రం 'చకోర'. దర్శకుడు పూరి జగన్నాథ్ శిష్యుడైన మంగా శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ చిత్రం, నేటి తరం ప్రేక్షకులకు నచ్చే అంశాలతో, స్వచ్ఛమైన ప్రేమ సిద్ధాంతాన్ని చాటిచెప్పే కథాంశంతో రూపొందింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ప్రేమకావ్యం ఏ స్థాయిలో అలరించిందో చూద్దాం.

 Hanuman Ansh Movie Review:'హనుమాన్ అంశ్' సినిమా రివ్యూ
Hanuman Ansh Movie Review:'హనుమాన్ అంశ్' సినిమా రివ్యూ

కథ
రాజమండ్రిలో చదువు పూర్తిచేసి ఫైనాన్స్ వ్యాపారంతో హాయిగా గడిపే కుర్రాడు రావణ బ్రహ్మ (శ్రవణ్). చిన్నప్పటి నుంచి అమ్మ చెప్పే చందమామ కథలు విని పెరిగిన రావణ, తన జీవితంలోకి కూడా జాబిల్లి లాంటి అమ్మాయే రావాలని కలలు కంటుంటాడు. ఆ క్రమంలో అతనికి డాక్టర్ చదువుతున్న జూలీ అలియాస్ జాబిలి (మలైకా టి వాసుపల్) తారసపడుతుంది. జాబిలిని చూడగానే తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. అయితే రావణ తన ప్రేమను వ్యక్తపరిచే సమయంలో జాబిలి ఒక వినూత్నమైన కండీషన్ పెడుతుంది. అదేంటంటే 24 గంటల పాటు తనకు దూరంగా ఉండాలి, అసలు మాట్లాడకూడదు. ఆ తర్వాత జాబిలి హఠాత్తుగా కనిపించకుండా పోతుంది. ఆమె కోసం రావణ రాజమండ్రి, వైజాగ్ నుంచి గోవా వరకు చకోర పక్షిలా ఎలా గాలించాడు? అసలు జాబిలి ఎందుకు అదృశ్యమైంది..? కంటికి కనిపించకుండా ఫోన్‌లోనే మాట్లాడే జాబిలి వెనుక ఉన్న రహస్యమేంటి? ఇక కథ మొదలైనప్పటి నుంచి స్టోరీ టెల్లర్‌గా వస్తున్న అనుష్క లూహార్‌ పాత్రకు, రావణకు ఉన్న సంబంధం ఏంటి? వీరి ప్రేమ కథ చివరికి ఏ తీరానికి చేరింది అనేది వెండితెరపై చూడాల్సిందే.

Chakora Movie Review Feel-Good Love Story with Surprising Climax starring Sravan and Malaika T Vasupal

విశ్లేషణ
చకోర పక్షి స్వచ్ఛమైన వర్షపు నీటి కోసమే వేచి చూసినట్లే, జీవితంలో లభించే నిజమైన ప్రేమ కోసం ఎంత కాలమైనా ఓపికగా ఎదురుచూడాలనే మౌలిక సూత్రాన్ని దర్శకుడు మంగా శ్రీనివాస్ అందంగా తెరకెక్కించారు. పూరి జగన్నాథ్ శిష్యుడు కావడంతో హీరో క్యారెక్టరైజేషన్‌లో ఆ మార్క్ రఫ్ నెస్, ఎనర్జీ స్పష్టంగా కనిపిస్తాయి. ఫస్టాఫ్‌లో హీరో ప్రేమ ప్రయత్నాలు ఎంటర్‌టైనింగ్‌గా ఉంటే, ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్‌లో హీరో ఎమోషన్స్‌తో హీరోయిన్ ఆడుకునే సన్నివేశాలను, వారు నేర్చుకునే ప్రేమ పాఠాలను దర్శకుడు చాలా పట్టుగా నడిపించారు. ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్‌లో వచ్చే ఊహించని ట్విస్ట్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

నటీనటుల పనితీరు
హీరో శ్రవణ్ ఇది తన మొదటి సినిమానే అయినా, ఎంతో అనుభవం ఉన్న నటుడిలా ఈజ్‌తో నటించాడు. లవ్ సీన్స్, ఎమోషనల్ సీన్స్‌లో రావణ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. హీరోయిన్ మలైకా టి వాసుపల్ డాక్టర్ జాబిలి పాత్రలో తన అందం, అభినయంతో మెప్పించింది. అనుష్క లూహార్ స్టోరీ టెల్లర్‌గా సినిమా ప్రారంభం నుండి అలరించిన అనుష్క, క్లైమాక్స్ ట్విస్ట్‌తో ప్రేక్షకులకు పెద్ద సర్‌ప్రైజ్ ఇస్తుంది. హీరో తల్లిదండ్రులుగా బ్రహ్మాజీ, ఇంద్రజ తమ అనుభవంతో సన్నివేశాలకు ప్రాణం పోశారు.సుమన్ , ఎల్ బి శ్రీరామ్, సుదర్శన్ తమ పాత్ర పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

నానా పటేకర్‌ చివరి సినిమా రిలీజ్ వాయిదా.. ఎందుకంటే?
నానా పటేకర్‌ చివరి సినిమా రిలీజ్ వాయిదా.. ఎందుకంటే?

సాంకేతిక వర్గ పనితీరు
ప్రిన్స్ హెన్రీ అందించిన పాటలు, నేపథ్య సంగీతంప్రేమ కథలోని ఆత్మను చక్కగా ఆవిష్కరించాయి.రుప్ప గోపీకృష్ణ కెమెరా పనితనం బాగుంది. రాజమండ్రి, వైజాగ్, గోవా లోకేషన్ల అందాలను స్క్రీన్ పై రిచ్‌గా చూపించారు.పరిమిత బడ్జెట్‌లో తీసినప్పటికీ చింతాడ హేమారావు పాటించిన నిర్మాణ విలువలు సినిమాలో క్వాలిటీగా కనిపించాయి.

ప్లస్ పాయింట్స్
*స్వచ్ఛమైన లవ్ కాన్సెప్ట్ , చివర్లో ఇచ్చే ఊహించని క్లైమాక్స్ ట్విస్ట్.
*హీరో శ్రవణ్, అనుష్క లూహార్ నటన.
*పాటలు ,నేపథ్య సంగీతం.
*వైజాగ్, గోవా రీజియన్ లొకేషన్ల దృశ్యాలు.

మైనస్ పాయింట్స్
*సెంకడాఫ్ స్లోగా ఉండటం
*పబ్లిసిటీ లేకపోవడం

ముగింపు
మొత్తానికి 'చకోర' అనేది నేటితరం ప్రేక్షకులకు, ముఖ్యంగా యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యే ఒక చక్కని, హృద్యమైన ప్రేమకథా చిత్రం. మంచి సందేశంతో పాటు, ఆకట్టుకునే సస్పెన్స్ ట్విస్ట్‌లతో సాగే ఈ చిత్రం ఈ వారంలో థియేటర్‌లో హాయిగా చూడదగ్గ ఒక ఫీల్ గుడ్ మూవీ. ప్రచారం కాస్త పెంచితే, బాక్సాఫీస్ వద్ద ఈ 'చకోర' మరిన్ని మంచి విజయాలను అందుకోవడం ఖాయం.

ఫైనల్‌గా
మంచి అనుభూతినిచ్చే స్వచ్ఛమైన ప్రేమకావ్యం 'చకోర'.

*రేటింగ్: 2.75/5

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+