విడాకులు తీసుకున్న మరో సెలబ్రిటీ జంట
ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువుగానే ఉంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకులు గురించి ప్రకటిస్తారో అనే విధాంగా పరిస్థితి మారిపోయింది. కలిసి ఉండలేక స్టార్స్ ఇలా విడాకుల బాట పడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి. తమ లైఫ్ పార్టనర్‌తో రాజీ పడకపోవడం, అత్తింటి గొడవలు ,పెళ్లి తరువాత కూడా కెరీర్ కొనసాగించడం, పర్సనల్ లైఫ్‌ను మెయిన్‌టైయిన్ చేయడం మొదలగు కారణాలతో సెలబ్రిటీలు విడాకులు బాట పడుతున్నారు.
ఇటీవల బుల్లితెర నటులు కూడా ఎక్కువగానే విడాకులు తీసుకుంటున్నారు. వెండితెర నటులకు తాము ఏమాత్రం తీసిపోమని బుల్లితెర నటులు నిరూపిస్తున్నారు. తాజాగా ఓ బిగ్‌బాస్ జంట విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన చందన్ శెట్టి, నివేదిత గౌడ అక్కడ బిగ్‌బాస్‌లో అడుగుపెట్టారు. అక్కడ ఏర్పడిన పరిచియం ప్రేమగా మారడంతో 2020 ఫిబ్రవరి 26న ఎంతో గ్రాండ్‌గా వీరు వివాహం చేసుకున్నారు. మొదట ఫ్రెండ్స్‌గా ఉన్న వీరు తర్వాత రిలేషన్‌లోకి దిగారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

వీళ్లు జంటగా నటించిన క్యాండీ క్రష్ సినిమా ఇంకా విడుదల కావాల్సి ఉంది. బిగ్‌బాస్ షోలో చూపించే లవ్ అంతా ఉట్టిదే అని చాలామంది అంటుంటారు. కానీ తమ ప్రేమ నిజమైనదని, అగ్నిలాగ స్వచ్ఛమైనదని నిరూపిస్తామని చెప్పి మరీ పెళ్లి చేసుకున్న ఈ జంట..ఇప్పుడు విడాకులు బాట పట్టడం హాట్ టాపిక్‌గా మారింది. బెంగళూరులోని ఫ్యామిలీ కోర్టులో విడాకులకు సైతం దరఖాస్తు చేకున్నారట. అయితే తమ విడాకుల గురించి ఈ జంట ఇప్పటి వరకు స్పందించలేదు.












Click it and Unblock the Notifications