థియేటర్లలో ఫ్లాప్.. ఓటీటీలో ధురంధర్ 2 రికార్డులు బద్దలు.. ఈ మూవీని ఇప్పుడే చూసేయండి..!
కొన్ని సినిమాలు థియేటర్లలో ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటాయి. కానీ ఓటీటీలో మాత్రం దుమ్ము దులుపుతాయి. ఆ సినిమా రిలీజ్ సమయానికి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆ సమయంలో ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో కొన్ని సినిమాలు విఫలం అవుతాయి. కానీ అదే సినిమాను ఓటీటీ, టీవీల్లో జనాలు ఎగబడి చూస్తుంటారు. ఇటీవలి కాలంలో చాలా సినిమాలకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. థియేటర్లలో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాలు ఓటీటీలో బ్లాక్ బస్టర్ విజయం సాధించాయి. ఇప్పుడు ఓ సినిమా అలాంటి జాబితాలోనే చేరింది.
ఈ ఏడాది మే 22న 'చాంద్ మేరా దిల్' అనే బాలీవుడ్ సినిమా రిలీజైన విషయం తెలిసిందే. బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్యా పాండే, 'కిల్' సినిమాతో మెప్పించిన లక్ష్య జంటగా ఈ మూవీలో నటించారు. స్వచ్ఛమైన క్యాంపస్ లవ్ స్టోరీగా ఈ మూవీ తెరకెక్కింది. ఇంజనీరింగ్ కాలేజీలో ఆరవ్, చాందిని అనే ఇద్దరు విద్యార్థుల మధ్య మొదలైన ప్రేమ.. ఆ తర్వాత వారి జీవితాల్లో ఎదురైన ట్విస్టులు, బాధాకరమైన సంఘటనలను ఈ మూవీలో చాలా ఎమోషనల్ గా ప్రెజెంట్ చేశారు. కానీ 'చాంద్ మేరా దిల్' మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆశించిన వసూల్లు రాబట్టలేక నిరాశపరిచింది. ఈ చిత్రానికి వివేక్ సోని దర్శకత్వం వహించారు.

అయితే ఈ మూవీ జూలై 17 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ ప్రారంభం అయింది. ఈ మేరకు ఓటీటీ ప్రేక్షకుల నుంచి 'చాంద్ మేరా దిల్' మూవీకి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీ విడుదలైన కేవలం రెండు రోజుల్లోనే ఓటీటీ ట్రెండింగ్ జాబితాలో అగ్రస్థానాల్లోకి చేరింది. ఇప్పటివరకూ టాప్ లో ఉన్న ధురంధర్ 2, ప్రీతమ్ అండ్ పెడ్రో వంటి చిత్రాలను వెనక్కు నెట్టి మూడో స్థానంలో ట్రెండింగ్ లోకి వచ్చింది. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోని ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల్ని అలరిస్తుండటం విశేషం. ఈ మూవీ రన్ టైమ్ రెండు గంటల 25 నిమిషాలు ఉంది.












Click it and Unblock the Notifications