రూ.100 కోట్ల ఆస్తిని పోగొట్టుకున్న చంద్రమోహన్
హీరోయిన్లకు స్టార్ డమ్ రావాలంటే చంద్రమోహన్ పక్కన కచ్చితంగా నటించాల్సిందే. పరిశ్రమలోకి వచ్చిన ప్రతి హీరోయిన్ అలాగే భావించేది. ఇండస్ట్రీలో కూడా అది ఒక సెంటిమెంట్ లా మారిపోయింది. వెయ్యి సినిమాలు పూర్తిచేస్తారేమోనని సన్నిహితులు, అభిమానులు ఎదురుచూసినప్పటికీ పూర్తిచేయకుండా కన్నుమూశారు. అన్ని సినిమాల్లో నటించిన వ్యక్తి తన చివరి దశలో అత్యంత సామాన్యమైన వ్యక్తిలా జీవించారు.
కొంతకాలం నుంచి చంద్రమోహన్ ఆరోగ్యం బాగుండటంలేదు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను సంపాదించినదానికన్నా పోగొట్టుకున్నదే ఎక్కువ అని చెప్పారు. ఆయన చెప్పింది వాస్తవమే. బిజీ ఆర్టిస్టుగా ఉంటూ రెండుచేతులా డబ్బు ను సంపాదించారుకానీ వాటిని నిలబెట్టుకోలేకపోయారు. శాస్త్రం కూడా డబ్బు సంపాదించడం గొప్ప కాదని.. దాన్ని నిలబెట్టుకోవడమే గొప్ప అని చెబుతోంది.

హైదరాబాద్ కొంపల్లిలో ద్రాక్షతోటను గొల్లపూడి మారుతీరావు కొనుగోలు చేశారు. ఆయన చంద్రమోహన్ ను కూడా కొనుగోలు చేయమని చెప్పారు. తెలియదు.. అలాగే ఎమోషనల్ గా నటించే వాళ్ళు కామెడీ చేయలేకపోవచ్చు. కానీ చంద్రమోహన్ ఆ రెండిటిని అవలీలగా చేయగలిగే గొప్ప నటుడు. ఆయన మాటమీద 35 ఎకరాల ద్రాక్షతోటను కొన్నారు. అయితే తర్వాతకాలంలో దాన్ని చూసుకునేవారెవరూ లేకపోవడంతో మొత్తం అమ్మేశారు. ఒక్క ఎకరం కూడా ఉంచుకోలేదు. అలాగే చెన్నైలోని 15 ఎకరాల భూమిని కూడా అమ్మేశారు. వాటిని అమ్మొద్దని శోభన్ బాబు ఎంతో చెప్పారు. అయినా వినకుండా ఆ భూమిని అమ్మేశారు. ఆ 50 ఎకరాలు చంద్రమోహన్ దగ్గరుండివుంటే రూ.100 కోట్లకు పైనే ఆస్తులుండేవి. సంపాదించి కూడా తాను ఆస్తులను నిలబెట్టుకోలేకపోయానంటూ బాధపడేవారు.












Click it and Unblock the Notifications