'ఛావా' మూవీ తెలుగులో ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎన్ని కోట్లు అంటే?
బాలీవుడ్ డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో విక్కీ కౌశల్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన సినిమా 'ఛావా'. ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమా గత నెలలో హిందీలో రిలీజ్ అయ్యింది. అదిరిపోయే టాక్ తో బాలీవుడ్ లో ఈ సినిమా రికార్డులు కొల్లగొడుతోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో విక్కీ కౌశల్ నటించడం జాదు జీవించేశారు అని చెప్పవచ్చు. ఈ సినిమాతో శంభాజీ మహారాజ్ వీరత్వం గురించి మరింత మందికి తెలిసిందని బాహాటం గానే వ్యాఖ్యానిస్తున్నారు. థియేటర్‌లలో సైతం ప్రేక్షకులు ఎమోషనల్ అవుతున్న వీడియోలు వైరల్‌అవుతున్నాయి.
ఈ క్రమంలోనే ఈ సినిమాను తెలుగులో సైతం రిలీజ్ చేసేందుకు గీతా ఆర్ట్స్ ముందుకు వచ్చింది. తెలుగు వెర్షన్ ని సైతం మార్చి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఈ చిత్రానికి తెలుగులో భారీ ఓపెనింగ్స్ రావడం కష్టమే అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రేంజ్ రెస్పాన్స్ ఇవ్వడం తో ట్రేడ్ పండితులు సైతం షాక్ కి గురిఅవుతున్నారు. మంచి సినిమాని మన ఆడియన్స్ ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆదరిస్తారు అనడానికి ఈ సినిమా ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు.

ఈ చిత్రానికి మొదటి రోజు తెలుగు రాష్ట్రాల నుండి రెండు కోట్ల 45 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయట. గ్రాస్ వసూళ్లు మూడు కోట్ల రూపాయలకు పైగానే ఉందని తెలుస్తోంది. బుక్ మై షో లో ప్రస్తుతం ఈ సినిమాకి గంటకు నాలుగు వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడవుతున్నాయని సమాచారం. మొదటి రోజు మూడు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తే, రెండవ రోజు కచ్చితంగా నాలుగు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వస్తుందని అంచనా వేస్తున్నారు.
ఇక వీకెండ్‌లో కచ్చితంగా కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరోవైపు మహేష్ బాబు, వెంకటేష్ కలిసి నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా కూడా రీ రిలీజ్ అయిన కారణంగా ఛావా తెలుగు వసూళ్లపై ప్రభావం కొంత మేరకు ఉన్నట్లు భావిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది తెలుగు ప్రేక్షకులు హిందీలో చూడటంతో పాటు.. కొందరు పైరసీ కూడా చూసేయడంతో కలెక్షన్స్ కొత్త తగ్గాయని అంచనా వేస్తున్నారు. ఇదే కంటిన్యూ అయితే ఈ చిత్రం ఫుల్ రన్ లో 50 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications