అల్లు, మెగా ఫ్యామిలీ విభేదాలు.. రాజీకి బాలయ్య ఎంట్రీ!

మెగా కుటుంబానికి, అల్లు అర్జున్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందనే విషయం తెలిసిందే. ఎప్పటినుంచో ఉన్న వివాదం చిలికి చిలికి గాలివానలా మారడానికి కారణం ఏపీ అసెంబ్లీ ఎన్నికలు. పిఠాపురం నుంచి పోటీచేస్తున్న పవన్ దగ్గరకు మెగా కుటుంబ సభ్యులంతా స్వయంగా వెళ్లి ప్రచారం నిర్వహించారు. అల్లు అర్జున్ మాత్రం ట్వీట్ తో సరిపెట్టారు. నంద్యాల నుంచి వైసీపీ తరఫున పోటీచేస్తున్న కిషోర్ రెడ్డికి మద్దతుగా ఆయన నంద్యాలవెళ్లి చిన్నపాటి ర్యాలీ కూడా నిర్వహించారు. అంతే.. ఒక్కసారిగా మెగా అభిమాలనుంతా అల్లు అర్జున్ పై భగ్గుమన్నారు.

రోజురోజుకు తీవ్రమవుతున్న విభేదాలు
ఆరోజు నుంచి ఈరోజు వరకు వీరిమధ్య విభేదాలు తీవ్రమవుతూనే ఉన్నాయి. ఇటీవలే పవన్ కల్యాణ్ సినిమాల్లో కథానాయకులు ఎర్రచందనం స్మగ్లర్లు నటిస్తున్నారంటూ పరోక్షంగా పుష్పపై వ్యాఖ్యలు చేశారు. మారుతీనగర్ సుబ్రమణ్యం వేడుకకు హాజరైన అల్లు అర్జున్ తనవారికోసం ఎంతదూరమైనా వస్తానని, వారికోసమే తాను హీరో అయ్యానంటూ వ్యాఖ్యానించారు. వీరి విభేదాలు సద్దుమణిగే పరిస్థితి మాత్రం కనపడటంలేదు. నందమూరి నటసింహం బాలకృష్ణ పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబరు ఒకటో తేదీన గోల్డెన్ జూబ్లీ వేడుక నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటివారందరికీ ఆహ్వానం అందింది.

chiranjeevi and pawan kalyan and allu arjun will participate in a same event

ఒకే వేదికను పంచుకోవాల్సి ఉంది
ఇప్పటివరకు మాటల యుద్ధాలు చేస్తున్న వీరు ఈ వేడుకలో ఒకే వేదికను పంచుకోనుండటం ఆసక్తికరంగా మారుతోంది. బాలయ్య వేడుక కాబట్టి తప్పనిసరిగా రావాలి. అందులోను ఆహాకు హోస్త్ గా వ్యవహరిస్తున్నారు. వస్తే చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ కు అల్లు అర్జున్ ఎదురుపడాల్సి ఉంటుంది. మొఖమాటం కోసం హాయ్ చెప్పుకుంటారా? అదికూడా ఉండదా? అనేది ఆరోజు తేలుతుంది. చిరంజీవి జన్మదినం సందర్భంగా అల్లు అర్జున్ ట్వీట్ పెడితే దానికి చిరు రిప్లై ఇచ్చారు. అంతకుమించి వీరిమధ్య మాటల్లేవు. అల్లు అరవింద్ ఎటూ చెప్పలేకపోతున్నారు. బాలయ్య వేడుకలో అందరిచూపు మెగా కుటుంబ సభ్యులపైనే ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఈ విభేదాలను పరిష్కరించాల్సిన బాధ్యత చివరకు బాలయ్యపైనే ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆయన జోక్యం చేసుకొంటేనే వివాదం సద్దుమణుగుతుందని, మెగా కటుంబంలో గతంలోలా ఆహ్లాదకరనమైన వాతావరణం నెలకొంటుందంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+