2023లో చిరంజీవి, పవన్ కల్యాణ్ చేసిన తప్పులు
మెగాస్టార్ చిరంజీవి గురించి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. 2023వ సంవత్సరం వీరిద్దరికీ చేదు అనుభవాలనే మిగిల్చింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి భోళాశంకర్ చిత్రం చేశారు. తమిళంలో వచ్చిన వీరం సినిమాకు ఇది రీమేక్. రీమేక్ సినిమాను ఎన్నుకున్నప్పటికీ మెహర్ రమేష్ తన దర్శకత్వ ప్రతిభతో ఈ సినిమాను డిజాస్టర్ చేశాడు. తెరకెక్కించిన విధానాన్ని చిరంజీవి అభిమానులెవరూ జీర్ణించుకోలేకపోయారు.
ముందునుంచి అభిమానులు ఈ సినిమాపై ఆశలు పెట్టుకోలేదు. వారి అంచనాలను నిజం చేసేలా మెహర్ రమేష్ ఈ సినిమాను తీశారు. అలాగే పవన్ కల్యాణ్ తమిళంలో వచ్చిన వినోదయ సీతంకి రీమేక్ చిత్రం బ్రో చేశారు. మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి నటించారు. ఈ సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలింది. ఒకరకంగా అన్నదమ్ములిద్దరీ 2023 భారీ నష్టాలను మిగిల్చిందని చెప్పొచ్చు.

చిరంజీవి అయితే ఇంతకుముందు రీమేక్ చేస్తానని కమిట్ అయిన కొన్ని సినిమాలను ఇప్పుడు హోల్డ్ లో పెట్టారు. స్ట్రెయిట్ సినిమాల మీద ఫోకస్ పెడుతున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు వశిష్ట డైరెక్షన్ లో వస్తున్న విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. ఇది విజయం సాధిస్తేనే చిరంజీవి బౌన్స్ బ్యాక్ అవడానికి అవకాశం ఉంటుంది. సోషియో ఫాంటసీ సినిమాగా తెరకెక్కుతోంది. గతంలో చిరంజీవి హీరోగా వచ్చిన జగదేకవీరుడు అతిలోక సుందరడి చిత్రం తరహాలో తీయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై చిరంజీవి అభిమానులతోపాటు తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. పవన్ కల్యాణ్ కూడా రీమేక్ సినిమాకు ప్రస్తుతం దూరంగా ఉన్నారు. ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరిహర వీరమల్లు లాంటివన్నీ స్ట్రెయిట్ చిత్రాలే.












Click it and Unblock the Notifications